Vande Bharat Express: సికింద్రాబాద్ నాగపూర్ మధ్యలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి వందే భారత్ రైలు ఈ రూట్లో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ సర్వీసు జాతికి అంకితం కాబోతోంది.
Vande Bharat Express to Begin Nagpur-Secunderabad: సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఈనెల 15 నుంచి సికింద్రాబాద్ నాగపూర్ మధ్యలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పలు రూట్లో వందే భారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ వరకు వందే భారత్ రైలు ప్రయాణించనుంది.
మొత్తం 578 కిలోమీటర్ల ఈ దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో పూర్తిచేసే అవకాశం లభిస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు చాలా సమయం కలిసి వచ్చే అవకాశం ఉంది అంతేకాదు. తెలంగాణలోని కాజీపేట, రామగుండం స్టేషన్లలో కూడా ఈ రైలు ఆగనుంది. అలాగే బల్లార్షా చంద్రపూర్ సేవాగ్రం స్టేషన్లో కూడా ఈ ట్రైన్ ఆగుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఈ రైలు షెడ్యూల్ విషయానికి వస్తే కొత్త వందే భారత్ రైలు నాగపూర్ లో ఉదయం ఐదు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణం మధ్యాహ్నం ఒకటి గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నాగపూర్ చేరుకుంటుంది.
ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ రూట్ గుండా మరిన్ని స్టేషన్లకు వందే భారత్ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ నగరానికి చేరుకోవడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఉద్యోగులు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం తో పాటు కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు సైతం ఎక్కువగా హైదరాబాదుకు వివిధ పనుల రీత్యా వస్తూ ఉంటారు.
వీరి అవసరాల కోసం వందే భారత్ రైలు ఎక్కువగా ఉపయోగపడుతుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ నాగపూర్ మధ్యలో వందే భారత్ ట్రైన్ నడిపేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతి విశాఖ బెంగళూరు నగరాలకు వందే భారత్ ట్రైన్లు సేవలు అందిస్తున్నాయి. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంతపూర్ బెంగళూరుకు వందే భారత్ సర్వీసు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే టికెట్ ధరల వివరాలు అతి త్వరలోనే తెలుపుతామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. వందే భారత్ రైళ్లు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
అంతేకాదు ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అన్ని బోగీలోను ఏసీ సదుపాయం ఉంది. అయితే వందే భారత్ రైళ్లలో ఇంకా స్లీపర్ బోగీలను ప్రవేశపెట్టలేదు. త్వరలోనే స్లీపర్ భోగిలను కూడా ప్రవేశపెడితే మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది అని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.