Vande Bharat Sleeper Trian Ticket Price and Timings: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టిన తరువాత ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వందే భారత్ ట్రైన్స్‌లో కేవలం కూర్చొని వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాదిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు కేవలం పగటి సమయంలో మాత్రమే రాకపోకలు సాగిస్తుండగా.. వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ రాత్రిపూట కూడా సేవలు అందించనున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు నమూనాను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్‌లో వందే భారత్ స్లీపర్ ట్రైన్‌సెట్‌లను ప్రవేశపెట్టే దిశంగా అడులు వేస్తోంది. ఈ రైలు న్యూఢిల్లీ-శ్రీనగర్ మధ్య మొదటి ట్రైన్ నడవనుంది.
వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్‌కు నేరుగా కనెక్ట్ అవుతుందని ఓ రైల్వే అధికారి తెలిపారు. రాబోయే కాలంలో ఈ రైలును బారాముల్లా వరకు కూడా నడిపే అవకాశం ఉందన్నారు.
న్యూఢిల్లీ-శ్రీనగర్ మధ్య దూరం 800 కి.మీ కంటే ఎక్కువగా ఉండగా.. వందే భారత్ స్లీపర్ రైలులో 13 గంటల్లోపు చేరుకోవచ్చు.
ఈ రైలు న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు శ్రీనగర్‌కు చేరుకుంటుంది. ఈ రైలు అంబాలా కాంట్ జంక్షన్, లూథియానా జంక్షన్, కథువా, జమ్ము తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, సంగల్దాన్, బనిహాల్ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది.
ఇందులో AC 3 టైర్ (3AC), AC 2 టైర్ (2AC), AC ఫస్ట్ క్లాస్ (1AC) సౌకర్యాలు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైలులో న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ 3ACకి రూ.2 వేలు, 2ACకి రూ.2500, ఫస్ట్ ఏసీకి రూ.3 వేలుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.