varalaxmi sarath kumar Wedding expences: వరలక్ష్మి శరత్‌కుమార్ లు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జులై 2 న థాయిలాండ్‌లో వీరి వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి కొద్ది మంది అతిథులు, దగ్గరి బంధువులు, స్నేహితులు హజరయినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటి వరలక్ష్మిశరత్ కుమార్, బిజినెస్ మెన్ నికోలయ్ ను థాయిలాండ్ లో పెళ్లి చేసుకున్నారు. అదే విధంగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం చెన్నైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది. పెళ్లికి రాలేని వారు, చెన్నైలోని రిసెప్షన్ కు హజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి, నికోలయ్ ల పెళ్లికి జరిగిన ఖర్చు మాత్రం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. నికోలయ్ చాలా ధనవంతుడని, వారికి కోట్లల్లో టర్నోవర్ లున్న బిజినెస్ లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్ల వరకు ఉండోచ్చని కూడా ప్రచారం జరుగుతుంది.
అందుకే పెళ్లిని థాయ్ లాండ్ లోను, పెళ్లికి వరలక్ష్మికి, అత్తింటి వారు.. భారీగా బంగారం, వజ్రాలతో పొదిగిన బిగ్ నెక్లెస్ లను బహుమానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా తన గారాల బిడ్డ పెళ్లికి శరత్ కుమార్.. రూ. 200 కోట్లకు పైగానే ఖర్చుచేసినట్లు తమిళనాట ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతుంది.
రిసెప్షన్ కు పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, సెలబ్రీటీలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఖచ్చితంగా కోట్లలో ఖర్చులు చేశారని కూడా సినిమా వర్గంలో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. అతిథులకు కూడా కాస్లీ రిటర్న్ గిఫ్ట్ లు కూడా ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉండగా.. వరలక్ష్మి, నికోలయ్ పెళ్లిఖర్చులపై జరుగుతున్న పుకార్లపై వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ స్పందించారు. ఇవన్ని రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. తమ బిడ్డ వివాహం.. మా బడ్జెట్ లో.. అందరిలాగా చేశామని అన్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం లేని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేవలం తమ రేటింగ్స్, వ్యూస్ పెంచుకోవడం కోసం థంబ్ నెయిల్స్ పెట్టి ఇష్ట మోచ్చిన విధంగా వార్తలు రాస్తున్నారని అసహానం వ్యక్తం చేశారు. పెళ్లికి అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, ఒకవేళ నా వద్ద అంత డబ్బే ఉంటే సినిమాలు చేయాల్సిన అవసరమేంటని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మోద్దని శరత్ కుమార్ హితవు పలికారు.
ఇదిలాఉండగా వరలక్ష్మి పెళ్లి చేసుకున్న నికోలయ్ సచిదేవ్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీ బిజినెస్‌ను నడుపుతున్నాడు. ఆయనకు గతంలోనే మోడల్ కవితతోపెళ్లి జరిగింది. 15 ఏళ్ల కూతురు కాషా కూడా ఉంది. తాజాగా సచ్దేవ్ ఇప్పుడు వరలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఏది ఏమైన వీరి పెళ్లి ఖర్చు మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.