Vidadala Rajini Re Entry To Chilakaluripet అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారుతారని ప్రచారం జరిగిన మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆమెకు తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేట బాధ్యతలు దక్కాయి. పార్టీ అధిష్టానం చేపట్టిన పదవుల భర్తీలో ఆమెకు తిరిగి పాత స్థానం లభించింది.
ఆంధ్రప్రదేశ్ మహిళా రాజకీయ నాయకురాలలో కీలకమైన విడదల రజనీ వైఎస్సార్ సీపీతోనే కొనసాగనున్నారు. తన జగన్ అన్నను వదిలి వెళ్లే యోచన లేదని తేలిపోయింది.
పరిణామాలు తారుమారు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాజీ మంత్రి విడదల రజనీ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది.
పుకార్లు: ఆమె పార్టీకి రాజీనామా చేశారని.. త్వరలోనే జనసేనలో కానీ టీడీపీలో కానీ రజనీ చేరుతారనే పుకార్లు వచ్చాయి.
తిరిగి బాధ్యతలు: తాజాగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం రజనీకి తిరిగి పాత నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.
అక్కడ పోటీ: కొన్ని నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరిపేట కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో రజనీ ఓటమి చెందారు.
మళ్లీ నియామకం: ఎన్నికలు ముగిసిన దాదాపు ఆరు నెలల తర్వాత తిరిగి రజనీ పాత స్థానమైన చిలకలూరిపేట బాధ్యతలను వైసీపీ అప్పగించింది.
మళ్లీ పాత గూటికే: చిలకలూరిపేట సమన్వయకర్తగా విడదల రజనీని నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.
వజ్రబాబు: తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా బాల వజ్రబాబు (డైమాండ్ బాబు)ను వైఎస్సార్‌సీపీ నియమించింది.