Vijay Devarakonda Recent Movies Pre Release Business:'ఫ్యామిలీ స్టార్' సహా విజయ్ దేవరకొండ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Vijay Devarakonda Recent Movies Pre Release Business: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెద్దగా సినీ బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా స్టార్ హీరోగా సత్తా చూపెడుతున్న వాళ్లలో  విజయ దేవరకొండ ఒకరు. రవితేజ, నానిల తర్వాత స్వయంకృషితో స్టార్ అయింది ఈయనే. గత కొన్నేళ్లలో హీరోగా విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది. సినిమా సినిమాకు బిజినెస్ కూడా పెరుగుతోంది. తాజాగా ఈయన హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసింది. ఈయన గత చిత్రాల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ థియోట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..

1 /7

ఫ్యామిలీస్టార్.. (Family Star) పరశురామ్ పేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

2 /7

ఖుషీ (Khushi).. ఖుషీ (Khushi).. విజయ్ దేవరకొండ, సమంత హీరో, హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఖుషీ'. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

3 /7

లైగర్ (Liger) విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'లైగర్'. హీరోగా విజయ్ దేవరకొండకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /7

వరల్డ్ ఫేమస్ లవర్ (World Famous Lover)   విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /7

డియర్ కామ్రేడ్.. (Dear Comrade) గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /7

టాక్సీవాలా.. (Taxiwala) రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ 'టాక్సీవాలా'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /7

నోటా (NOTA) ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సినిమా 'నోటా'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.