Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..

Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.

1 /6

Vijay: తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్.. మాత్రం తన పార్టీ పేరులో ద్రవిడ అనే పేరు లేకుండా.. ‘తమిళగ వెట్రి కళగం’ అంటూ తమిళనాడు పేరు సూచించేలా తన పార్టీ పేరు పెట్టారు.

2 /6

అప్పట్లో అన్న ఎన్టీఆర్.. తెలుగు దేశం పార్టీ మాదిరే ఈ  పేరు ఉందనే ప్రచారం జరగుతోంది. అంతేకాదు రాజకీయ రంగం .. సినీ రంగం వంటిది కాదు.. ఇదో వైకుంఠపాళి. ఇక్కడ పాము నోట్ల పడతామనే తెలిసే అన్నింటికీ తెగించి ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ రంగంలోకి వచ్చినట్టు చెప్పారు.

3 /6

తమిళనాడు విల్లుపురం జిల్లా విక్రమాండి సమీపంలో జరిగిన పార్టీ సభలో ఈయన పార్టీ లక్ష్యాలు అన్ని డీఎంకే తరహాలో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ రద్దు.. తమిళం, ఇంగ్లీష్ ద్విభాష సిద్దాంతం.. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి.. తమిళనాడును అధికార భాషతో పాటు వాదన భాషగా మార్చడం.. పెరియార్ సిద్దాంతంలో నాస్తికం కాకుండా మిగతావి ఆ పార్టీనే పోలీ ఉన్నాయి.

4 /6

మరోవైపు అందరికీ కూడు, గూడు, పని కల్పించడమే తమ పార్టీ కర్తవ్యమన్నారు.  మత్తు రహిత తమిళనాడు, వేర్పాటు వాడుదలు అవినీతి పరులే తన ప్రత్యర్థులు అంటూ డీఎంకే దునుమాడారు. అందులో వేర్పాటు వాదం అంతం, పెరియార్ లోని నాస్తిక వాదంలో కేవలం హిందూ మతాన్ని  తప్పు పట్టడం.. అనేది బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్లోగన్ లా ఉన్నాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

5 /6

అంతేకాదు అవసరమైతే వేరే పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలో భాగస్వామ్యం అవుతామనే కామెంట్స్ పవన్ కళ్యాణ్.. జనసేనను గుర్తుకు తెస్తున్నాయి. పార్టీని పెట్టిన పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించింది. రెండో సారి ఎన్నికల్లో పూర్తిగా చతికిల బడినా.. మూడోసారి పడిలేచిన బంతిలా ఏపీలో ప్రభంజనంలా దూసుకువచ్చారు.

6 /6

మొత్తంగా చూసుకుంటే.. విజయ్ పార్టీలో ద్రవిడ పార్టీతో పాటు, బీజేపీ, జనసేన పార్టీల్లోని అంశాలు ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.