Telangana: మహిళలకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. రూ.2,500 ఆరోజు జమా చేయనున్న ప్రభుత్వం..!

Good News To Telangana Women: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అతి త్వరలో మహిళల ఖాతాల్లో రూ.2,500 జమా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కీలక ప్రకటన చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కో పథకం అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రేవంత్‌ సర్కార్‌, తాజాగా వారి ఖాతాల్లో రూ.2,500 జమా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది.  

2 /5

ఇదిలా తాజాగా అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మహిళల ఖాతాల్లో రూ.2,500 పై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది వారి ఖాతాల్లో జమా చేసేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో రూ.2,500 అందించనున్నట్లు చెప్పారు.  

3 /5

ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యంతోపాటు రేవంత్‌ సర్కార్‌ 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత కరెంటు బిల్లు, రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌లను కూడా అందిస్తున్నారు. ఇది కాకుండా రైతు భరోసా, రూ.500 సన్నవడ్ల బోనస్‌ కూడా కేవలం 48 గంటల్లో జమా చేస్తున్నారు.  

4 /5

ఇక కొత్త ఏడాది 2025లోనే కల్యాణ లక్ష్మిలో భాగంగా మహిళలకు తులం బంగారం పథకం కూడా మొదలు కానుంది. అలాగే రైతుబంధు డబ్బులను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించింది.   

5 /5

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 3 శాతం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. కానీ, వారికి కేవలం ఒక్క బకాయి మాత్రమే దక్కింది. ఇందిరమ్మ ఇళ్లను కూడా రేవంత్‌ సర్కార్‌ అర్హులైన మహిళల పేరిట మంజూరు చేస్తున్న సంగతి తెలిసింది. ఖాళీ స్థలం ఉంటే రూ.5 లక్షలు కూడా ప్రకటించనుంది.