Tirumala: భక్తులకు భారీ ఆఫర్ ప్రకటించిన టీటీడీ.. ఇలా చేస్తే సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం..

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల మంది భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తుంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి టికెట్లను మంజూరు చేస్తారు. అయితే వృద్ధుల కోసం బంపర్ ఆఫర్ ని ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం వృద్ధుల కోసం ప్రత్యేక ఆచార్యులు తీసుకుంటుంది వారికి సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేలా చేస్తోంది. వృద్ధుల కోసం ప్రత్యేక దర్శన వెసులుబాటు కల్పిస్తున్న టీటీడీ వారికి ఉచిత  దర్శనంతో పాటు భోజన సదుపాయాలు కూడా కల్పిస్తోంది.  

2 /5

ప్రతిరోజు రెండు ఫ్లాట్లో వారికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తోంది. వయస్సు రీత్యా పెద్దవారికి శ్రీవారి దర్శనం కోసం ఎక్కువ సమయం పాటు ఎదురు చూడాల్సిన పనిలేదు. వారికి ఏ ఇబ్బందులు ఎదురుకాకుండా సకలం సమకూరుస్తున్నారు టీటీడీ యంత్రాంగం. అంతేకాదు దర్శనం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కూడా వృద్ధులకు సాంబార్ అన్నం, వేడిపాలు వారికి అందించనున్నారు.  

3 /5

దర్శనం తర్వాత కూడా వీరికి బ్యాటరీ కారులో డ్రాప్ చేయనున్నారు. కేవలం అరగంటలోనే వృద్ధులకు దర్శనం కల్పిస్తుంది. మరిన్ని పూర్తి వివరాలు పొందాలంటే 0877227777 సంప్రదించవచ్చు.  

4 /5

ఇదిలా ఉండగా నేటి నుంచి టీటీడీ కల్యాణోత్సవం ఆర్జిత తిరుమంజాసన సేవ టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు 24వ తేదీన విక్రయించనున్నారు. అదేరోజు గదులకోట కూడా మధ్యాహ్న 3:00 నుంచి విక్రయిస్తారు.   

5 /5

అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి సాధారణ భక్తుల కోసం టీటీడీ ఇలా ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను అందుబాటులో పెడుతుంది. ముందుగా బుక్‌ చేసుకున్నవారికి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతోంది. ఇటీవల 2025 ఫిబ్రవరి కోటాకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చేసింది టీటీడీ.