Vivah Panchami: మార్గశిర మాసంలోని శుక్ల పక్ష పంచమిని వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ రాముడు సీతాదేవీల వివాహాం జరిగిందని చెప్తుంటారు. ఈరోజున పెళ్లికానీ వారు.. కొన్నిపరిహారాలు పాటిస్తే వెంటనే పెళ్లి కుదురుతుందని పండితులు చెబుతుంటారు.
మనదేశంలో అనాదీగా అనేక హిందు ధర్మాలు, ఆచారాలు, సంప్రదాయలు పాటిస్తుంటాం. అదే విధంగా మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుకాల కూడా.. నిగూఢమైన అర్థాలు దాగున్నాయని చెప్తుంటారు.
సాధారణంగా.. ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షం ఐదవ రోజున వివాహ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్తుంటారు.
అందుకు ఈరోజున అందరు రాముడు, సీతమ్మతల్లిని భక్తితో పూజించుకుంటారు. అయితే.. ఇటీవల చాలా మంది తమ వైవాహిక జీవితంలో పలు సమస్యలతో బాధపడుతుంటారు. మరికొందరు పెళ్లి సెటిల్ కాక కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ నేపథ్యంలో వివాహ పంచమి నేపథ్యంలో కొన్ని పరిహారాలు పాటిస్తే.. జీవితంలో భార్యభర్తల మధ్య గొడవలు ఉండకుండా ఉండటంతో పాటు, ఎల్లప్పుడు ధన సంపద కల్గుతుందంట.
ప్రస్తుతం పంచమి.. అనేది ఈసారి డిసెంబర్ 5న మధ్యాహ్నం వస్తుంది. అదే విధంగా డిసెంబరు 6 సాయంత్రం వరకు ఉంది. అయితే.. డిసెంబర్ 6న సూర్యోదయానికి ఉండటం వల్ల.. 6న వివామ పంచమిగా జరుపుకోనున్నారు.
వివాహ పంచమిరోజున సీతారాముల కళ్యాణం, బెల్లం పానకం, రామా ఫలం, సీతాఫలం శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఫోటోలు పెట్టుకుని, పూజలు చేసిన నైవేద్యం పెట్టాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే వారంలో పెళ్లి సెటిల్ కావడంతో పాటు, అపారమైన ధనరాశులు సొంతమౌతుందంట.