Fenugreek Seeds Remedies: రోజూ పరగడుపున నానబెట్టిన మెంతులు ఎన్ని రోజులు తినాలి, ఏం జరుగుతుంది

Fenugreek Seeds Remedies: ప్రతి కిచెన్‌లో తప్పకుండా కన్పించే పదార్ధం మెంతులు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. అందుకే ఆయుర్వేదంలో మెంతులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలా వాడాలో తెలుసుకోగలిగితే చాలు. ఇందులో ఉండే వివిధ రకాల ఫైటోకెమికల్స్ మనిషి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుతాయి.

Fenugreek Seeds Remedies: మెంతుల్లో ఆల్కలాయిడ్, కార్బోహైడ్రేట్లు, ఎమైనో యాసిడ్స్, మినరల్స్, స్టోరాయిడల్ శాపోనిన్ ఉంటాయి. అందుకే రోజూ క్రమం తప్పకుండా నానబెట్టిన మెంతుల్ని పరగడుపున సేవిస్తే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

1 /9

మెంతులు ఎలా తీసుకోవాలి రోజూ రాత్రి వేళ ఓ చెంచా మెంతుల్ని నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేవగానే మెంతుల్ని క్రష్ చేసి అదే నీటితో సహా తినేయాలి. ఇలా 15-20 రోజులు చేస్తే చాలా ఫలితాలు గమనించవచ్చు.

2 /9

హార్మోన్ సమతుల్యత మెంతులు మహిళలకు చాలా ఉపయోగకరం. హార్మోన్స్ సమతుల్యతకు ఉపయోగపడతాయి. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పుల్ని దూరం చేస్తుంది. హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది

3 /9

హెయిర్ అండ్ స్కిన్ కేర్ మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని నిగనిగలాడేట్టు చేస్తాయి. పింపుల్స్, మొటిమలు, మచ్చల్ని దూరం చేస్తాయి. కేశాల సంరక్షణకు ఉపయోగపడతాయి. హెయిర్ ఫాల్ నియంత్రిస్తుంది.

4 /9

బరువు నియంత్రణ మెంతులు బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. మెంతులు తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మెటబోలిజం వేగవంతం చేస్తుంది

5 /9

కొలెస్ట్రాల్ తగ్గుదల మెంతుల్లో శ్యాపోనిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గించేందుకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల్ని దూరం చేస్తుంది

6 /9

జీర్ణక్రియ మెరుగుదల నానబెట్టిన మెంతులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలైన మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉండే లిక్విఫైడ్ ఫైబర్ కారణంగా గుడ్ బ్యాక్టిరియా పెరుగుతుంది. 

7 /9

బ్లడ్ షుగర్ కంట్రోల్ మెంతుల్లో బ్లడ్ షుగర్ నియంత్రించే గుణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు చాలా దోహదపడతాయి. ఇందులో ఉండే ఫైబర్, గ్యాలిక్ యాసిడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది

8 /9

నానబెట్టిన మెంతులతో లాభాలు నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పరగడుపు తింటే మరింత లాభదాయకం. 15-20 రోజులు తీసుకుంటే ఊహించని లాభాలు చూడవచ్చు

9 /9

మెంతుల్లో పోషకాలు మెంతుల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల చాలా వ్యాధుల్నించి రక్షిస్తుంది. రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. నానబెట్టిన మెంతుల్ని రోజూ పరగడుపున కేవలం 15 రోజులు వాడితేనే చాలా లాభాలు చూడవచ్చు