Mahakumbh Mela: కుంభమేళ 12 ఏళ్లకు ఒకసారి ఎందుకు..?.. నాగసాధులు కుంభమేళ సమయంలోనే ఎందుకు కన్పిస్తారు..?

Mahakumbhmela 2024: కుంభమేళ కోసం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు దాదాపు 45 రోజుల పాటు కుంభమేళా జరగనుందని తెలుస్తొంది.

1 /8

 మన దేశంలో పన్నేండేళ్లకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారురు.ఈ సారి కూడా ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ లలో  కుంభమేళను నిర్వహించనున్నారని తెలుస్తొంది.  కుంభమేళకు ఆయా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని కోట్లాది మంది ఈ కార్యక్రామంలో పాల్గొంటారు.  కుంభమేళ అనేది.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు అంటే..దాదాపు.. 45 రోజుల పాటు నిర్వహిస్తారు.

2 /8

ఈ పవిత్రమైన సమయంలో ఆయా నదుల్లో దేవతను కొలువై ఉంటారని చెప్తుంటారు. దీన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభం అంటే… సంస్కృతంలో కుండ, కడవ అని అర్థం. దీనినే కలశం అని అనొచ్చు. కుంభమేళకు కొన్ని ప్రత్యేకమైన కాలాలల్లో నిర్వహిస్తారు. సూర్యుడు-బృహస్పతి… సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. 

3 /8

సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో నిర్వహిస్తారు. అదే విధంగా.. బృహస్పతి వృషభరాశిలో-సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. అలాగే… బృహస్పతి-సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారని పండితులు చెబుతుంటారు.

4 /8

కుంభమేళాను 12ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుపుకోవడం వెనుక.. పురాణ కథలు ఎన్నో ఉన్నాయి.  క్షీరసాగర మథనం సమయంలో..  అమృతం లభిస్తే.. చెరి సంగం పంచుకుందామని రాక్షసులతో ఒప్పందం కూడా చేసుకుంటారు. అయితే… సముద్రం నుంచి అమృతం కుండ బయటపడగానే.. దాని కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్దం మొదలవుతుంది.  

5 /8

12 రాత్రులు, 12 పగటి సమయంలో దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తారంట. దేవతలు సాయం చేసేందుకు వచ్చిన మహావిష్ణువు అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతాడు. ఆ సమయంలో ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో కొన్ని అమృతపు బిందువులు పడినాయని చెప్తుంటారు. 

6 /8

అందుకే ఆ నాలుగు ప్రదేశాల్లో కుంభమేళను నిర్వహిస్తారు. దేవతలు, దానవులు.. 12 రోజుల పాటు యుద్దం చేశారు. దేవతకు భూమి మీద ఒక సంవత్సరం.. కేవలం ఒక్క రోజుతో సమానం. అందుకే కుంభమేళను 12 ఏళ్లకొసారి నిర్వహిస్తారని కథలు ప్రచారంలో ఉన్నాయి.   

7 /8

కుంభమేళ సమయంలో మాత్రమే... నాగసాధువులు బైటకు వస్తుంటారు. వీరు ఒంటినిండా విభూతి ధరించి, లంగోటాలు ధరించి ఉంటారు. మరికొందరు నగ్నంగా ఉంటారు. వీరు ఆకాశాన్ని తమ అంగవస్త్రంగా భావిస్తారు. అదే విధంగా వీరు మిగత సమయాలలో.. హిమాలయాలు, అడవులు, స్మశానాలలో మనిషికి కన్పించకుండా గుప్తంగా ఉంటారు.  

8 /8

కేవలం కుంభమేళ సమయంలో మాత్రం తండోపతండాలుగా బైటకు వచ్చి.. ఆయా ప్రదేశాలలో పవిత్ర జలాలలో స్నానాలు చేసి.. అక్కడి దేవతల్ని దర్శించుకుంటారు. వీరికి అతీంద్రియ శక్తులుంటాయని చెప్తుంటారు. స్మశానంలోని శవాలను సైతం తింటుంటారు. వీరి ఆరాధన చాలా విచిత్రంగా ఉంటుంది. పవిత్ర జలాలలో స్నానం చేశాక.. ఎక్కడినుంచి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్లిపోతారు.