Elon Musk Success Ideas: ఎలాన్ మస్క్‌ను ప్రపంచ కుబేరునిగా చేసిన సక్సెస్ ఐడియాలేంటో తెలుసా

ఎలాన్ మస్క్ అంటే తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టెక్ దిగ్గజం. ప్రపంచంలోనే ధనికుడు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు యజమాని. కళాశాల రోజుల్లో తనకు కలిగిన ఐదు ఐడియాలే ప్రపంచంలోనే కుబేరుడిగా చేసిందనేది ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పిన మాటలు. అవే అతని సక్సెస్ సీక్రెట్స్ కూడా. 

Elon Musk Success Ideas: ఎలాన్ మస్క్ అంటే తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన టెక్ దిగ్గజం. ప్రపంచంలోనే ధనికుడు. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీలకు యజమాని. కళాశాల రోజుల్లో తనకు కలిగిన ఐదు ఐడియాలే ప్రపంచంలోనే కుబేరుడిగా చేసిందనేది ఎలాన్ మస్క్ స్వయంగా చెప్పిన మాటలు. అవే అతని సక్సెస్ సీక్రెట్స్ కూడా. 
 

1 /5

అంతరిక్షంలో కేవలం భూమ్మీదే కాకుండా ఇతర గ్రహాలపై ఉండటం కూడా ప్రజలు నేర్చుకోవాలనేది ఎలాన్ మస్క్ ఆలోచన. అందుకే స్పేస్ ఎక్స్ పేరుతో ఓ కంపెనీ స్థాపించాడు. దీని ద్వారా అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా, సులభంగా మార్చాడు

2 /5

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ చాలా శక్తివంతమైందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్మాడు. అయితే దీన్ని విస్తృతం చేసేందుకు మరో కంపెనీ స్థాపించాడు.

3 /5

మెరుగైన జీవన విధానం వ్యాధుల్ని దూరం చేసేందుకు న్యూరోలింక్ అనే న్యూరోటెక్నాలజీ కంపెనీ స్థాపించాడు. ఇది మెదడుని కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తుంది. ఈ కంపెనీని ఎలాన్ మస్క్ 2016లో స్థాపించాడు

4 /5

ఇంటర్నెట్ ఎలాన్ మస్క్‌కు ఇంటర్నెట్ బలం ఏంటనేది తెలుసు. ఇంటర్నెట్ ద్వారా ఏదైనా సాధ్యం చేయవచ్చని అతని నమ్మకం. జిప్ 2, పేపాల్ వంటి కంపెనీలు స్ఖాపించాడు. వీటి ద్వారా ఇంటర్నెట్‌ను విస్తృతం చేశాడు.

5 /5

పర్యావరణం కాపాడటం భూమిని కాపాడేందుకు ఎదో ఒకటి చేయాలని ఎలాన్ మస్క్‌కు బలంగా ఉండేది. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలి. అందుకే టెస్లా కంపెనీ స్థాపించి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేశాడు.