How to Extract Text From Images: వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్. వాట్సాప్‌లో ఓ సరికొత్త ఫీచర్ యాడ్ అవుతోంది. వాట్సాప్ యూజర్స్‌ని ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని జోడించేందుకు నిరంతరం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తోన్న వాట్సాప్.. తాజాగా ఐఓఎస్ యూజర్స్ కోసం మరో ఫీచర్‌ని తీసుకొస్తోంది.
WhatsApp Exclusive Feature: ఫోటోలపై ఉండే అక్షరాలను స్కాన్ చేసి రీడ్ చేసేలా వాట్సాప్ యూజర్స్ కోసం ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఆ కొత్త ఫీచర్ ఏంటి, ఏం ప్రయోజనం అనే వివరాలను ఈ ఫోటోగ్యాలరీ కథనం ద్వారా తెలుసుకుందాం రండి.
అవును, వాట్సాప్‌లో షేర్ అవుతున్న అనేక ఫోటోలపై టెక్ట్స్ కనపడటం మనం చూస్తుంటాం. అందులో కొన్నిసార్లు ఆకర్షణీయమైన వాఖ్యాలు కనిపిస్తుంటాయి కానీ వాటిని ఫోటోలోంచి వేరు చేసి కాపీ చేసేందుకు సాంకేతికంగా అవకాశం ఉండదు.
ఫోటోలపై వాఖ్యాలను కాపీ చేయడానికి అవకాశం లేకపోవడానికి ఓ కారణం ఉంది. ఎప్పుడైతే ఫోటోపై పదాలను టైప్ చేసి ఒక ఫైనల్ ఔట్పుట్ తీసుకుంటారో.. అప్పుడే అవి ఒక సింగిల్ లేయర్ కిందకు మారిపోతుంటాయి. అంటే ఫోటో వేరు.. ఫోటోపై ఉండే టెక్ట్స్ వేరు కాదన్నమాట.
కాకపోతే, స్మార్ట్ ఫోన్స్ సహాయంతో అలాంటి ఫోటోలను స్కాన్ చేసి టెక్ట్స్ వేరు చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్‌కే పరిమితమైంది.
తాజాగా వాట్సాప్ ఐఓఎస్ యూజర్స్‌కి ఈ టెక్ట్స్ ఎక్స్ట్రాక్షన్ చేసే ఫీచర్‌ని వాట్సాప్ లాంచ్ చేస్తోంది. దీంతో ఇకపై ఫోటోలపై తమకు నచ్చిన వాఖ్యాలను, అవసరమైన మ్యాటర్‌ని ఫోటో నుంచి సేకరించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. ఇలాంటి అవకాశం ఉంటే బాగుండు అని ఎదురుచూస్తున్న వారికి ఇది కచ్చితంగా గుడ్ న్యూసే అవుతుంది కదా మరి.
అయితే వాట్సాప్ ప్రయోగాత్మకంగా లాంచ్ చేస్తోన్న ఈ టెక్ట్స్ ఎక్స్ట్రాక్షన్ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం యాపిల్ ఫోన్ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులోకి రానుంది.