Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్బుక్.
Whatsapp latest updates: Whatsapp to get Instagram Reels అందులో భాగంగానే వాట్సాప్‌లో కొత్తగా మరో అప్డేట్ రాబోతోంది. అదేమంటే.. వాట్సాప్‌లోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ని ప్లే చేసుకుని చూసుకునే ఫీచర్ యాడ్ కాబోతోందన్నమాట.
వాట్సాప్‌లో కొత్తగా రాబోయే మరో అప్డేట్ గురించి WABetaInfo ముందే లీకులు ఇచ్చేసింది. వాట్సాప్‌లోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ని ప్లే చేసుకుని చూసుకునే ఫీచర్ యాడ్ కాబోతోందనేది WABetaInfo వెల్లడించింది.
వాట్సాప్‌లో వచ్చే కొత్త కొత్త ఫీచర్ అప్డేట్స్పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి పెట్టిన WABetaInfo ట్విటర్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.
ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లింకుని Android users వాట్సాప్‌లో షేర్ చేసుకున్నప్పుడు ఆ లింక్ ప్లే అవుతోందని పేర్కొన్న WABetaInfo.. ఇక చెక్ చేయాల్సింది iOS users ఉపయోగిస్తున్న వాట్సాప్‌లో మాత్రమేనని స్పష్టంచేసింది.
ఫేస్బుక్లో Instagram stories లేదా WhatsApp stories ప్లే అయ్యే ఆప్షన్స్‌ని సైతం ఫేస్బుక్ ఇన్క్లూడ్ చేసినట్టు ఈ సంస్థ తెలిపింది.
ఇదిలావుంటే, మరోవైపు WhatsApp privacy policy విషయంలో వాట్సాప్‌కి యూజర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.
అయితే, తాము తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ గురించి మరిన్ని అంశాలను WhatsApp alerts ద్వారా వాట్సాప్ యూజర్స్‌కి స్పష్టత ఇవ్వనున్నట్టు వాట్సాప్ ఇటీవలే ప్రకటించింది.
మే 15వ తేదీలోగా Whatsapp users వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి తెలుసుకుని తమ అంగీకారం తెలపకపోయినట్టయితే, వారి Whatsapp account రద్దు అయిపోయినట్టేనని వాట్సాప్ హెచ్చరిస్తోంది. Also read : Indian YouTubers Pay Tax: ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కు Google షాకింగ్ న్యూస్ Also read : Twitter new feature: త్వరలో కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టనున్న ట్విట్టర్, ఆ ఫీచర్లు ఇవే Also read : PUBG Relaunch: మీకిష్టమైన PUBG Relaunch ఎప్పుడో తెలుసా..పబ్ జీ ప్రేమికులకు గుడ్‌న్యూస్ Also read : COVID-19 facts: కరోనా సోకిన వారిలో 78% మంది overweight లేదా obesity పేషెంట్సే