White Hair Remedies: డైట్ ఇలా మార్చితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లబడటం ఖాయం ఆ విటమిన్ లోపమే కారణం

White Hair Remedies: ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు అధికమయ్యాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటం లేదా రాలిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. ఆఖరికి 25-30 ఏళ్ల వయస్సులోనే ఈ సమస్య వెంటాడుతోంది. జెనెటిక్ కూడా ఓ కారణమైనా అత్యధిక శాతం కాలుష్యం, వాతావరణం, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే. అంటే ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉందని. ఆ వివరాలు మీ కోసం..

White Hair Remedies: చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలితో పాటు వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ కు కారణమౌతున్నాయి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. అన్ని రకాల పోషకాలుండే ఆహార పదార్ధాలే తీసుకోవల్సి ఉంటుంది. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటానికి కారణం విటమిన్ లోపమేనంటున్నారు వైద్య నిపుణులు..

1 /1

విటమిన్ బి అనేది అత్యంత కీలకమైంది. ఈ విటమిన్ ప్రభావం నేరుగా కేశాలతో ఉంటుంది. ఈ విటమిన్ లోపిస్తే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడటంతో పాటు హెయిర్ ఫాల్ సమస్య వెంటాడుతుంది.