Chiranjeevi vs Mohan Babu: తాజాగా చిరంజీవికి.. ఏఎన్ఆర్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం నిన్న ఘనంగా జరిగింది.. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి.. బాలీవుడ్ బిగ్ బి..ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 17 ఏళ్ల నాటి తన మనసులో బాధను ఆయన బయటపెట్టారు.
తాజాగా చిరంజీవి సినీ ఇండస్ట్రీలో చేసిన విశిష్ట సేవకు అక్కినేని జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇంట గెలిచి, రచ్చ గెలవాలి అనే ఒక నానుడి ఉంది. కానీ సినీ పరిశ్రమలో నేను తొలుత రచ్చే గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమ నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల.. సమయంలోనే ఇచ్చింది. అప్పుడు నాకు లెజెండ్రీ పురస్కారం ప్రధానం చేసినప్పుడు ఆ సమయంలో చాలా ఆనందమేసింది. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు నాపై పెదవి విరిచారు. నేను అవార్డు తీసుకోవడం వారికి ఆనందంగా అనిపివ్వలేదు. అందుకే ఆ పురస్కారాన్ని తీసుకోవడం నాకు సముచితంగా అనిపించలేదు” అంటూ చిరంజీవి చెప్పగా.. నాడు మోహన్ బాబును ఆయన టార్గెట్ చేసుకొని ఈ విధంగా కామెంట్లు చేశారు అంటూ కొంతమంది చెబుతున్నారు.
ఇకపోతే చిరంజీవి మాట్లాడుతూ.. “ఆరోజు అవార్డు తీసుకోవడానికి సంతోషంగా అనిపించలేదు. ఇప్పుడు ది గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ చేతుల మీద అందుకుంటూ ఉండడంతో చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు ఇంట గెలిచాను. రచ్చ గెలిచాను” అని అంటూ చిరంజీవి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే చిరంజీవి ఈ మాటలు చెప్పడంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పుడు చిరంజీవి కొరటాల శివదే.. తప్పు అంటూ కామెంట్ చేశారు.
ఇక వజ్రోత్సవాల సమయంలో మోహన్ బాబుకు.. నచ్చక పోవడం వల్ల తనకు అవార్డు తీసుకోవడం ఇష్టం లేదు అంటూ ఇప్పుడు ఇన్ డైరెక్ట్ గా మోహన్ బాబుని గిల్లే తట్టు మాట్లాడారు. ఏది ఏమైనా ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం పద్ధతిగా లేదు.. అందరికీ ఆదర్శంగా ఉండాలి.. కానీ చిరంజీవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చిరంజీవి ఇలాంటి సమయంలో తనపై నెగెటివిటీ పడేలా.. చేసుకుంటున్నారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.