Runamafi In telangana: రైతులకు రేవంత్ సర్కార్ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దీపావళి తర్వాత రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో పండుగ ముందే రైతులకు తీపి కబురు అందింది. రేవంత్ సర్కార్ మొన్నే ఒక డీఏ ఇవ్వనున్నట్లు కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి తర్వాత రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Runamafi In telangana: తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఈనెల 26న జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో రైతులకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు.
మొన్నటి వరకు రుణమాఫీ కాలేని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేపట్టారు. అయితే, వివిధ కారణాల వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి దీపావళి పండుగ తర్వాత రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల్లో తప్పులు దొర్లడంతో వారికి రుణమాఫీ కాలేదు. రేవంత్ సర్కార్ ఏర్పడినప్పుటి నుంచి ఇప్పటి వరకు మూడు విడుతలలో రైతులకు రుణమాఫీ చేశారు.
ఇదిలా ఉండగా వివిధ కారణాల వల్ల నాలుగు లక్షల మంది వరకు రుణమాఫీ కాలేదు. దీంతో వారు ధర్నాలు సైతం నిర్వహించారు. తాజాగా కేబినెట్ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు త్వరలోనే మిగతా రుణమాఫీ చేయనున్నారు.
దీపావళి తర్వాత ఈ నాలుగు లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీంతో వారికి పండుగ ముందే తీపి కబురు అందింది. ఇప్పటికే ఉచిత కరెంట్, ప్రీ బస్సు సౌకర్యం, రూ.500 సిలిండర్ అందిస్తున్న ప్రభుత్వం. రైతులకు కూడా పండుగ గుడ్‌న్యూస్ చెప్పింది.