Sleeping Tips: ప్రస్తుతం చలిపులి అందర్ని వణికిస్తోందని చెప్పుకొవచ్చు. ఒక వైపు చలి.. మరోవైపు తుపాను ప్రభావంతో కూడా చలితీవ్రత మరింత పెరిగిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది అస్సలు బైటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడంలేదని తెలుస్తొంది.
సాధారణంగా చలితీవ్రత ఎక్కువగా ఉంటే.. అస్సలు ఏ పనిచేయాలని అన్పించదు. చాలా డల్ గా ఉంటూ.. ఒక చోట కూర్చుండిపోతాం. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లేందుకు ఇష్టపడరు.
ఏదైన వేడి వేడి పదార్థాలు తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. సాధారణంగా చలికాంలో జలుబు, వైరల్ ఫీవర్ లు, గొంతు నొప్పి, శ్వాస తీసుకొవడంవంటి సమస్యలు వస్తుంటాయి.
అయితే.. చలికాలంలో చాలా మంది ముఖం నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. బెడ్ షీట్ తో ముఖం అంతా కవర్ చేసుకుంటే.. శ్వాస సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల గుండె కోట్టుకొవడంలో మార్పులు వస్తాయి.
ఈ నేపథ్యంలో తలనొప్పి, వాంతులు, వికారంఇది క్రమ క్రమంగా అస్తమాకు కూడా దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది బెడ్ షీట్ లను వారినికి ఒకసారి ఉతకడానికి వేస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం నెలల తరబడి అస్సలు బెడ్ షీట్ లను పట్టించుకోరు. దీని వల్ల అవి మురికి కూపంగా, క్రిములకు అడ్డగా మారిపోతాయి.
ముఖం మొత్తం కవర్ చేసేయడం వల్ల.. ఆక్సిజన్ అందక.. కొన్నిసార్లు గుండెపోటులు సంభవించవచ్చని తెలుస్తొంది. అదే విధంగా ఆక్సిజన్ లెవల్స్ పైన కూడా దీని ప్రభావం ఉంటుందని తెలుస్తొంది. సాధారణంగా మనం కార్బన్ డై ఆక్సైడ్ వదిలి.. ఆక్సిజన్ ను తీసుకుంటుంటాం. ఇలా బెడ్ షీట్ కవర్ చేసుకొవడం వల్ల .. వదిలిన గాలిని మళ్లీ తీసుకుంటుంటాం.
శరీరంలోకి మనకు తెలియకుండానే.. ప్రాణాలు తీసే వాయువును పీల్చుకుంటున్నామన్నమాట. దీని ప్రభావం వల్ల మెదడు, రక్త నాళల పనితీరు దెబ్బతింటుంది. క్రమంగా శరీరం స్పందన కొల్పోవడం వంటి సమస్యలు ఏర్పడుతాయంట. జుట్లు రాలిపోవడం, గోంతులో నొప్పి, శరీరంలోక అలసట వంటి సమస్యలు వస్తాయంట. అందుకే ముఖం నిండా దుప్పటి కప్పుకొకుండా.. అప్పుడప్పుడు.. ముఖంను బైటకు ఉంచాలంట.