Water Heater safety tips: చలికాలంలో వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నారా..?.. ఈ తప్పులు అస్సలు చేయోద్దు..

1 /5

వాటర్ హీటర్ ను కొంత మంది బకెట్ లో నీళ్లను పెట్టుకుని గంటల కొద్ది అలానే వదిలేస్తారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయంట. ఇంట్లో వాటర్ హీటర్ పెట్టకుండా.. వరండాలో లేదా గాలి ఎక్కువగా ఉన్న చోట వాటర్ హీటర్ పెట్టాలంట.  

2 /5

దీని నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతాయంట. అందుకే వాటర్ హీటర్ ను ఇంట్లో పెట్టవద్దని నిపుణులు చెబుతుంటారు.  ఇంట్లో గనుక చిన్న పిల్లలు ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి.

3 /5

వాటర్ హీటర్ ను పెట్టినప్పుడు దాన్ని ఒక కంట కనిపెడుతునే ఉండాలి. కొన్ని సార్లు హీటర్ కాయిల్ ఎక్కువగా వేడి అయిపోయి మంటలు చెలరేగే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. 

4 /5

చిన్న పిల్లలు వాటర్ హీటర్ ను పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకు పిల్లలకు అందేలా, వారు తిరిగే ప్రదేశాలకు దూరంగా వాటర్ హీటర్ ను పెట్టాలి. అంతే కాకుండా.. వాటర్ హీటర్ కొన్నిసార్లు పేలిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి.  

5 /5

ముఖ్యంగా ఫోన్ లలో పడి చాలా మంది స్విచ్ ఆఫ్ చేయకుండానే వాటర్ హీటర్ ను పట్టుకుంటారు. దీని వల్ల కరెంట్ షాక్  ప్రమాదంకు గురయ్యే అవకాశం ఉందని తెలుస్తొంది. అందుకే వాటర్ హీటర్ వాడేటప్పుడు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి.