Business ideas: చలికాలంలో దీనికి మించిన వ్యాపారం లేదు..ఖర్చు తక్కువ..లాభాలు ఎక్కువ

Business ideas:  ఏ వ్యాపారం చేయాలన్నా..పెట్టుబడి మార్కెట్, బిజినెస్ ఐడియా చాలా ముఖ్యం. వీటిని ద్రుష్టిలో పెట్టుకోకపోతే వ్యాపారంలో రాణించడం కష్టం. అంతేకాదు వ్యాపారం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అంది వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారం ప్రారంభించాలి. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత కూడా పెరిగింది. ఈ కాలంలో చేయాల్సిన బిజినెస్ ఐడియా గురించి మీకు చెబుతాము. ముఖ్యంగా మహిళలు ఇంట్లో కూర్చుండి కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఎలాగో చూద్దాం. 
 

1 /7

Business ideas:  మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే..శీతాకాలంలో మీరు వెచ్చని బట్టల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ( ఉలెన్ క్లాత్ వ్యాపారం ). ఈ బిజినెస్ తో  మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే శీతాకాలం మొదలైంది . చలి తీవ్రత భారీగా పెరిగింది. మీరు కేవలం 2-3 నెలల్లో భారీ మొత్తంలో ఆదాయం పొందవచ్చు.

2 /7

 చలికాలంలో జాకెట్లు, స్వెటర్లు, శాలువాలు తదితర ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. మీరు రిటైల్‌లో విక్రయించకూడదనుకుంటే, మీరు హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు.  

3 /7

రానున్న కాలంలో వెచ్చని దుస్తులకు డిమాండ్ మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల, మీ దుకాణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా దుస్తులను ఎంచుకోండి.  తద్వారా విక్రయాలకు ఆటంకం ఉండదు. శీతాకాలంలో, ప్రజలు చలి నుండి తమను తాము రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులను ఉపయోగిస్తారు.  

4 /7

ఒక్కో సీజన్‌లో కొత్త వింటర్‌ వేర్‌లు కూడా ఒక్కో ఫ్యాషన్‌ ప్రకారం మార్కెట్‌లోకి వస్తాయి. వెచ్చని బట్టల వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు మరింత వైవిధ్యతను కలిగి ఉండాలి. ఎంత వెరైటీ ఉంటే అంత ఎక్కువ బట్టలు కొంటారు. 

5 /7

చలికాలంలో వెచ్చని బట్టల వ్యాపారం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం శీతాకాలపు దుస్తులను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో విక్రయించవచ్చు.

6 /7

మీరు ఈ వ్యాపారాన్నికేవలం  రూ. 2 నుండి 3 లక్షలతో ప్రారంభించవచ్చు. పెద్దగా పెట్టుకోవాలంటే  రూ.5 నుంచి 7 లక్షలు అవసరం కావచ్చు. మీరు వెచ్చని దుస్తులను పెద్దమొత్తంలో ఆర్డర్ చేయాలనుకుంటే, మీరు వాటిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లేదా ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రదేశాల నుండి ఆర్డర్ చేయవచ్చు. ఈ రాష్ట్రాలన్నీ ఉన్ని బట్టల ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. లేదంటే మీరు నివసించే ప్రదేశాల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. 

7 /7

మీరు వీటిని స్టోరేజ్ చేసే స్థలంగా పొడిగా ఉండాలి. తేమతో కూడిన ప్రదేశాలు ఉన్ని, వెచ్చని దుస్తువులకు అనుకూలం కాదని గుర్తుంచుకోండి. తేమ కారణంగా ఉన్ని దుస్తుల్లో ఫంగస్ ఏర్పడుతుంది. దీనివల్ల నష్టపోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారంలో లాభం మీ కృషిపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా, వాతావరణం మీ సంపాదనకు అతిపెద్ద ఆధారం.ఈ వ్యాపారంలో సాధారణంగా 30 నుండి 40 శాతం లాభం సాధించవచ్చు.