World Cup 2023: వరల్డ్ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై నవంబర్ 19 వరకూ జరగనుంది. ఇండియా ఆతిధ్యం ఇవ్వనున్న ఈ ప్రపంచకప్ 45 రోజులు నడవనుంది. ఈ ఈవెంట్‌లో 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
World Cup 2023: దేశంలోని వేర్వేరు నగరాల్లో ఈ 48 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న ప్రపంచంలోని టాప్ 5 అత్యంత ధనవంతులెవరో తెలుసా..ఈ ఐదుగురిలో ఇద్దరు భారతీయులే కావడం విశేషం
విరాట్ కోహ్లి ప్రపంచకప్ 2023లో ఆడుతున్న అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లి. కోహ్లీ సంపద 950 కోట్లకు పైగా ఉంది.
స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ జాబితాలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఇతడి మొత్తం సంపాదన 200 కోట్లుగా ఉంది.
రోహిత్ శర్మ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఇతడి సంపద మొత్తం 210 కోట్లు ఉంటుంది.
ప్యాట్ కమ్మిన్స్ ఈ జాబితాలో మరో ధనవంతుడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. ప్యాట్ కమ్మిన్స్ సంపద 350 కోట్లు ఉంటుంది.
మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇతడి సంపద 150 కోట్లు ఉంటుంది.