Xiaomi 15 Ultra Price: త్వరలోనే మార్కెట్‌లోకి Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్పుడు తెలుసుకోండి.
Xiaomi 15 Ultra Launch Date: ఎప్పటి నుంచో మంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi నుంచి మరో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. ఇది లక్ష బడ్జెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ బడ్జెట్‌కు అనుగుణంగానే ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర, ఇతర కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Xiaomi కంపెనీ మార్కెట్‌లోకి అతి త్వరలోనే Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ కెమెరాతో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. దీనిని కంపెనీ Xiaomi 14 Ultra సక్సెసర్‌గా అందుబాటులోకి తీసుకు రానున్నారు.
ఈ శక్తివంతమైన Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్ 6000 mAH బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇది 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో ఫీచర్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ 15 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మొదట చైనాలో ఫిబ్రవరి 28వ తేదిన విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లో కూడా అందుబాటులోకి తీసుకు రానున్నారు. విడుదలకు ముందే ఈ మొబైల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Xiaomi 15 అల్ట్రా మొబైల్ 6,000mAh బ్యాటరీతో ఎంతో శక్తివంతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసేందుకు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ Xiaomi 15 Ultra స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 4.32GHz ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన ఫీచర్స్‌లో పేర్కొన్నారు. దీనిని కంపెనీ 16GB ర్యామ్‌తో పాటు 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లాంచ్ కానుంది.
ఈ శక్తివంతమైన మొబైల్ 6.7-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1440×3200 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ దాదాపు రూ.1.34 లక్షలలోపే విడుదల చేయనుంది.