Where Is Located Kalki 2898 AD Temple: యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.
Kalki 288 AD Movie Temple: చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయట పడుతూ గతవైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
Kalki 288 AD Movie Temple: ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయి. వాటిలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో నాగేశ్వర స్వామి ఆలయం ఒకటి.
Kalki 288 AD Movie Temple: కల్కి 2898 ఏడీ సినిమాలో ఈ ఆలయం కనిపించడంతో మళ్లీ ఆలయంపై చర్చ మొదలైంది.
Kalki 288 AD Movie Temple: పెరుమాళ్లపాడు ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా తెలుస్తోంది.
Kalki 288 AD Movie Temple: పెన్నా నది తీరంలో ఇసుక తిన్నెలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది.
Kalki 288 AD Movie Temple: 2020లో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది.
Kalki 288 AD Movie Temple: ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని జానపద కథలు చెబుతున్నాయి. పెన్నా నదిలో 1850 సంవత్సరంలో భారీ వరదలు రావడంతో ఆ సందర్భంగా వచ్చిన ఇసుకలో కూరుకుపోయింది. ఆలయానికి ప్రమాదం పొంచి ఉండడంతో అక్కడ ఇసుక తవ్వకాలు నిలిపివేశారు.
Kalki 288 AD Movie Temple: కల్కి సినిమాలో ఈ ఆలయం కనిపించడంతో మరోసారి పర్యాటకులు, ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు బారులు తీరుతున్నారు.