nita ambani heartfele message apology to media video goes viral: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మనదేశంలో పాటు, ప్రపంచ దేశాల్లోని వీఐపీలు, వీవీఐపీలు కూడా అటెండ్ అయ్యారు. సినిమా, రాజకీయ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు హజరయ్యారు. అనంత్ రాధికల పెళ్లి కొన్ని తరాలు గుర్తుంచుకునేలా జరిగిందని వార్తలు వస్తున్నాయి. అనంత్ పెళ్లికి ముందకు 50 మంది నిరుపేదలకు పెళ్లిళ్లు చేసి భారీ కానుకలు అందజేశారు. అంతేకాకుండా.. తమ పెళ్లిళ్ల సమయంలో అనంత్ ఫ్యామిలీ పేదలకు వస్త్రదానం, అన్నదానం కూడా చేశారంట. మరోవైపు అనంత్ రాధికల పెళ్లి వేడుక ముంబైలోని జియో వరల్గ్ సెంటర్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది.
ఈ వేడుకకు..బాలీవుడ్, హలీవుడ్, కోలీవుడ్ ల నుంచి సినీ తారలు పెద్ద ఎత్తుర తరలివచ్చారు. అంబానీ పెళ్లిలో దాదాపు మూడు వేల రకాల ఫుడ్ ఐటమ్స్ లను అతిథులకు వండిపెట్టారంట. పెళ్లికి వచ్చే వారికోసం ప్రత్యేకంగా జెట్ విమానాలు, ఎక్కడ కూడా అతిథిమర్యాదలకు లోటులేకుండా కూడా చర్యలు తీసుకున్నారు. అనంత్ పెళ్లిలో తలైవా రజీనికాంత్ చేసిన డ్యాన్స్ ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. అనంత్ పెళ్లిని చూసిన వారంతా.. న భూతో.. న భవిష్యత్.. అంటూ కామెంట్లు చేస్తున్నారంట.. అంటే.. అంత గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగిందని చెప్తున్నారు. అనంత్ పెళ్లిలో.. తల్లి నీతా అంబానీ అన్ని తానై.. కొడుకు పెళ్లి దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రెడిట్ అంతా మా అత్తకే అని.. ఇటీవల రాధిక అత్తపై పొగడ్తల వర్షంకురిపించిందంట. ఈ నేపథ్యంలో నీతా అంబానీకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 12న ‘శుభ్ వివాహ్’తో మొదలైన అనంత్ రాధికల పెళ్లి వేడుకలు.. 13వ తేదీన ‘శుభ్ ఆశీర్వాద్’, 14వ తేదీన ‘మంగల్ ఉత్సవ్’తో గ్రాండ్‌గా ముగిశాయి. ఈ క్రమంలో వేడుకల చివరిరోజైన నిన్న ‘మంగళ ఉత్సవ్’ కార్యక్రమంలో నీతా అంబానీ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అపరధనికుడైన సతీమణి అయి ఉండి.. రెండు చేతులు జోడించి ఆమె చెప్పిన మెస్సెజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నీతా అంబానీ మాట్లాడుతూ.. అనంత్- రాధిక పెళ్లి సమయంలో సపోర్ట్ చేసినందుకు మీడియా అందరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి ఇల్లు అన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగటం కామన్ అని.. మీరంతా పెద్దమనస్సుతో అర్థంచేసుకుంటారని ఆశిస్తున్నానని నీతా అన్నారు. ప్రస్తుతం అంత ఉన్నత స్థానంలో ఉండి కూడా వినమ్రంగా క్షమాపణలు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది డౌన్ టూ ఎర్త్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.