Car U-Turn Viral Video: ఆ డ్రైవర్ మగాడ్రా బుజ్జా! కొండ అంచున కారు యూటర్న్

Car U-Turn Viral Video: ఓ కారు యూటర్న్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు యూటర్న్ చేయడం పెద్ద వింత ఏముంది అని అనుకుంటున్నారా? అయితే, కారు యూటర్న్ చేసింది సాధారణ రహదారిపై కాదు.. పర్వతం అంచున! అది కూడా కారు కూడా పట్టనంత ప్రదేశంలో ఓ డ్రైవింగ్ అవలీలగా SUV కారును యూటర్న్ చేశాడు. ఆ వీడియోలో ఏముందో మీరు చూసేయండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 01:29 PM IST
Car U-Turn Viral Video: ఆ డ్రైవర్ మగాడ్రా బుజ్జా! కొండ అంచున కారు యూటర్న్

Car U-Turn Viral Video: పర్వతాలపై డ్రైవింగ్ చేయడం అంత తేలికైన పని కాదు. ముఖ్యంగా అప్పుడే డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది పెద్ద సవాలే. అంతే కాకుండా డ్రైవింగ్ లో ఎంత అనుభవం ఉన్నా.. పర్వతాలపై డ్రైవింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా నడపాలంటే ఎంతో అపారమైన అనుభవంతో పాటు ధైర్యం కూడా అవసరం. 

భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో అలాంటి డైవర్లు (పర్వతాల్లో నడిపే డ్రైవర్) ఉంటారు. బ్యాట్ మ్యాన్ ను తలపించేలా కారును డ్రైవింగ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. 

పర్వతాలపై SUV కారు యూటర్న్

స్ట్రెయిట్ డ్రైవింగ్ చేయడం పెద్ద విషయమేమి కాదు. కానీ, పర్వతాలపై డ్రైవింగ్ చేయడం పెద్ద సవాలే. అలాంటి ఓ పర్వతంపై ఉన్న చిన్న రహదారిపై SUV కారును యూటర్న్ చేయడం మామూలు విషయం కాదు. కానీ, ఓ డ్రైవర్ చిన్న రహదారిలో.. పర్వతం అంచున్న ఉండి కారును యూటర్న్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. 

డ్రైవింగ్ లో ఎంతటి నిపుణులైన పర్వత రహదారులపై యూటర్న్ తిప్పేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి కారును అవలీలగా యూటర్న్ చేశాడు. 1.22 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.  

Also Read: Viral news: ఆ కుర్రాడు సెల్ఫీలతో కోట్లు సంపాదించాడిలా..!

Also Read: Funny Viral Video: మీ భర్త ఫోన్ లో ఏం చూస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ ట్రిక్ వాడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News