Doctor Left The Surgery For Masala Dosa In Jhansi: డాక్టర్లును చాలా మంది దేవుళ్లుగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తాడని అంటుంటారు. మనకు ఏరకమైన ఆరోగ్య సమస్యలు వచ్చిన కూడా డాక్టర్ల దగ్గరకు వెళ్తుంటాం. డాక్టర్లు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. కొందరు డాక్టర్లు తమ దగ్గరకు వచ్చే పెషెంట్లకు ధైర్యం చెబుతూ.. ఎంత పెద్ద జబ్బు ఉన్న కూడా దాన్ని తమ మాటలు, ఆపరేషన్ లు, సరైన విధంగా ట్రిట్మెంట్ ఇచ్చి జబ్బు నయం అయ్యేలా చేస్తారు. కానీ కొందరు వైద్యులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. పవిత్రమైన తమ వృత్తికి మచ్చ తీసుకు వచ్చేలా ప్రవర్తిస్తారు. పెషెంట్లను అస్సలు పట్టించుకోరు.
ఒక ప్రాబ్లమ్ ఉంటే, మరో ట్రీట్మెంట్ చేస్తారు. సరైన విధంగా జబ్బును నిర్దారించారు. టెస్టుల పేరిట టైమ్ వెస్ట్ చేస్తారు. మరికొందరు ఆస్పత్రికి వచ్చే బాధితులను లైంగికంగా వేధిస్తుంటారు. విధులలో మరికొందరు పూర్తిగా నెగ్లిజెన్సీగా ఉంటారు. సరైన విధంగా రోగులను ట్రీట్ చేయరు. సర్జరీ చేసిన కూడా పొట్టలో కాటన్, కత్తెరలు మర్చిపోయిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ కోవకు చెందిన ఒక విచిత్రమైన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీలో(JHANSI) అమానవీయకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న.. నవాబాద్ ప్రాంతంలో ఉంటున్న కాజల్ శర్మ కు చేదు అనుభవం ఎదురైంది. యువతి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. డాక్టర్లు బాలికకు సర్జరీ చేయాలన్నారు. ఈ క్రమంలో సర్జరీ చేస్తుండగా.. వైద్యుడు ఆకలేస్తుందని బైటకు వెళ్లిపోయాడు. రెండు గంటల తర్వాత వచ్చి మరల ఆపరేషన్ చేశాడు. కానీ యువతి మాత్రం నొప్పి తగ్గలేదు. ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసు ఉన్నతాధికారి.. ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఆమె నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
బాధితుల ప్రకారం.. నవాబాద్ ప్రాంతానికి చెందిన..ఓ బాలిక ప్రమాద వశాత్తూ కింద పడిపోవడంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. దీంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బాలికను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో వైద్యుడు ఉన్నట్లుండి తనకు ఆకలి వేస్తోందని, మసాలా దోశ తిని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెండు గంటల వరకు తిరిగి రాలేదు. ఆ తర్వాత వచ్చి హడావిడిగా ఆపరేషన్ పూర్తి చేశాడు.
ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆమె మోచేయి ఎముక కరెక్ట్ గా సెట్ కాలేదు. దీంతో ఆ డాక్టర్‌ని కలవడానికి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించాడు. అక్కడున్న వారుకూడా బాధితులను పట్టించుకోలేదు. బాధిత యువతి కాజల్ మాట్లాడుతూ.. ఆపరేషన్ జరిగినంత సేపు తాను మెలుకువగా ఉండి అన్నీ చూశానని, తన చేయి మాత్రమే మొద్దుబారిపోయి ఉందని కాజల్ తెలిపింది. ఆపరేషన్ తర్వాత అంతా నయం అయిపోతుందని చెప్పారని అన్నారు. కానీ.. సర్జతీ తర్వాత తన చేతి వేళ్లు కూడా వంకర్లు పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter