నిత్య జీవితంలో మనకు కావల్సినవి ఎన్నోసెకన్లలో మనకు చూపించే గూగుల్ సరికొత్త ఫీచర్ ( Google latest Feature ) ప్రవేశపెడుతోంది. మీరు మర్చిపోయిన ఇష్టమైన పాటను కూడా మీ ముందుకు తెచ్చిపెడుతుంది. అదెలా సాధ్యమంటారా..అవును మరి.
గూగుల్ సెర్చ్ ఇంజన్ ( Google Search Engine ). ది బెస్ట్ సెర్చర్ గా పేరు సంపాదించుకుంది అందుకే మరి. అప్పుడప్పుడూ కొన్ని తప్పులు జరుగుతున్నా ఓవరాల్ గా మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సందేహాన్ని సెకన్ల వ్యవధిలోనే తీర్చేస్తుంది. మీ సందేహానికి సంబంధించి ఒకట్రెండు పదాలు టైప్ చేస్తే చాలు..మీ మనస్సులో మీకున్న సందేహాన్ని కూడా చూపించి..అదా కాదా అని అడుగుతుంది. అవునంటే దానికి సమదానం చూపిస్తుంది. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence ) గా మనముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మరికాస్త అభివృద్ధి చేస్తూ రోజురోజుకూ కొత్ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్ ఓ భాగమైపోయింది.
ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ కు అంకురార్పణ చేసింది. అదే హమ్ టు సెర్చ్ ఆప్షన్ ( Hum to Search option ). మీకు బాగా ఇష్టమైన పాటను బహుశా మీరు మర్చిపోయారనుకోండి..ఆ పాట ట్యూన్ ను కాస్త హమ్ చేస్తే చాలు ..పాటేంటన్నది మీ కళ్ల ముందు చూపించేస్తుంది. మూడ్రోజుల క్రితం ప్రవేశపెట్టిన ఈ సరికొత్త గూగుల్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తం గా 20కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఫీచర్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( A I ) ఆధారిత గూగుల్ అసిస్టెంట్‌కు అనుసంధానం చేసింది గూగుల్. హే గూగుల్, ఈ పాట ఏమిటి? ( Hey Google, What is this song ? ) అని అడిగి..10-15 సెకన్ల పాటు పాట ట్యూన్ హమ్ చేస్తే చాలు..సంబంధిత పాటల జాబితా వస్తుంది. అందులో మనకిష్టమైన పాటను ఎంపిక చేసుకోవచ్చు. ట్యూన్‌ను బట్టి పాటను .. మెషీన్ లెర్నింగ్ అల్గోరిథం గుర్తిస్తుంది. గూగుల్ మ్యూజిక్ రికగ్నిషన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మోడల్స్ ట్యూన్ హ్యుమన్ వెర్షన్ స్టూడియోలో రికార్డ్ చేసిన పాటతో సెట్ అవుతుంది. ఈ మ్యూజిక్ రికగ్నిషన్ టెక్నాలజీ ( Music Recognition technology ) ని గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కనిపించే నౌ ప్లేయింగ్ ఫీచర్, గూగుల్ యాప్ లోని సౌండ్ సెర్చ్ ఫీచర్లో పొందుపరిచారు.
కేవలం పాటను హమ్ చేస్తే చాలు పాటను గుర్తు చేస్తుంది. గూగుల్ సెర్చ్ విడ్జెట్ లేదా గూగుల్ యాప్ లేటెస్ట్ వెర్షన్ లో పాట ట్యూన్ హమ్ చేసి తెలుసుకోవచ్చు. Also read: First Water Taxi: కేరళలో తొలి వాటర్ టాక్సీ ప్రారంభం! వీడియో చూడండి!