Aadhaar Card: ఇప్పుడు ఏ పనికైనా ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే ఆధార్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. మార్పులు, చేర్పులకు అవకాశం లభిస్తోంది. ఇప్పుడు ఫోటో సైతం మార్చుకునే సౌలభ్యం కల్పించింది. అదెలాగంటే
ఆధార్..నిజంగా నిత్య జీవితంలో ఓ ఆధారమైపోయింది.ప్రతి పనికీ ఆధార్ (Aadhaar) తప్పడం లేదు.బ్యాంక్ అక్కౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, సంక్షేమ పథకాలు ఇలా ప్రతీది ఆధార్‌తో లింక్ అయి ఉంటున్నాయి. అందుకే ఆధార్ కార్డులో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డులో మీ ఫోటోను సైతం మార్చుకునే అవకాశం కల్పించింది. ఆధార్ కార్డులో ఉన్న ఫోటో మీకు నచ్చకపోతే వెంటనే మీరు మార్చుకోవచ్చు. యూఐడీఏఐ (UIDAI)వెబ్సైట్ నుంచి ఫోటో ఛేంజ్ చేసుకోవచ్చు.
ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి ఒక ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్‌ను స్థానికంగా ఉన్న ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి నిర్ణీత ఫీజు చెల్లించాలి. తరువాత ఆధార్ నమోదు కేంద్రంలో మీ కొత్త ఫోటోను క్లిక్ చేసి ఆధార్ కార్డుకు అప్లోడ్ చేస్తారు. ఈ కొత్త సౌలభ్యంతో ఆధార్ కార్డులో(How to change photo in aadhaar card) ఫోటో నచ్చకపోతే వెంటనే మార్చుకోవచ్చిక.
Also read: World Corona Update: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా వైరస్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook