Interesting Facts About King cobra snakes: నాగు పాములు అంటే ఇండియాలోనే కాదు.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన సెపరేట్ ఇమేజ్ ఉంది. మరీ ముఖ్యంగా మన ఇండియాలోనైతే ఈ నాగు పాములకు ఉండే క్రేజే వేరు. కొంతమంది నాగు పాములను చూసి భయంతో పారిపోతే.. ఇంకొంతమంది నాగు పామును దైవ సమానంగా భావించి చేతులెత్తి దండం పెట్టే వాళ్లు కూడా ఉంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ నాగు పాము వీడియోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నాగు పాముల గురించి భయపడే వారు కూడా వాటి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కింగ్ కోబ్రా స్నేక్ గురించి చాలామందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని మీతో పంచుకునే ప్రయత్నమే ఈ డీటేల్స్..
నాగు పాముకు నిటారుగా లేచి నిలబడే శక్తి ఉంటుంది. ఈ శక్తిని ఆధారంగా చేసుకునే పాములు ఒక్కోసారి తమ ఎదుట నిలబడిన వారి కళ్లలోకి కళ్లు పెట్టి చూసినంత పని చేస్తుంటాయి.
నాగు పాములకు తమ పొడవులో మూడో వంతు ఎత్తులో నిలబడి కూడా ముందుకు వెళ్లే శక్తి ఉంటుంది. ఈ కారణంగానే పడగ విప్పి పైకి లేచి నిలబడినప్పుడు కూడా పాములు ముందుకే వెళ్లగలవు. ప్రత్యేకించి దాడి చేసే సమయంలోనూ పాములు ముందుకు వెళ్లగలగడావికి కారణం అదే.
నాగు పాములు మనుషులను పగ పడుతుంటాయి అని చెబుతుంటారు కదా.. కానీ వాస్తవానికి నాగు పాములకు మనుషులు అంటే ఒక రకమైన సిగ్గు, బిడియం కలిగి ఉంటాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇదే నిజమని సైన్స్ చెబుతోంది.
విష సర్పాలలో అత్యంత పొడవైన పాము నాగు పామే. అవును.. ఎందుకంటే నాగు పాము 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుందంట. విష సర్పాలలో ఇదే అతి పొడవైన పాము.
నాగు పాము ఒక్కసారి కాటు వేసినప్పుడు విడుదల అయ్యే విషంతో 20 మందిని చంపవచ్చట. లేదంటే నాగు పాము ఒక్క కాటులో ఒక ఏనుగు ప్రాణం తీసేంత విషం ఉంటుంది అని నాగు పాము గురించి అధ్యయనాలు చేసిన వారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Hotel Waiter To IAS Officer: హోటల్లో వెయిటర్‌గా పనిచేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు
ఈ భూ ప్రపంచం మొత్తంలో కేవలం నాగు పాములు మాత్రమే అవి పొదిగే గుడ్ల కోసం గూడు కట్టుకుంటాయి. మిగతా ఏ పాము కూడా గుడ్లను పొదడగడం కోసం గూడు కట్టుకుంటాయన్న ఆనవాళ్లు లేవు.
వాస్తవానికి నాగు పాములు తమ చుట్టూ ఉండే శబ్ధాలు వినలేవు. అయితే, అవి భూమి మీద తమ శరీరానికి తగిలే వైబ్రేషన్స్ ఆధారంగానే అవి శత్రువు రాకను గుర్తిస్తాయని స్నేక్ సైన్స్ చెబుతోంది.
ఇది కూడా చదవండి : IRCTC Train Tickets: పొరపాటున కూడా ఈ రైల్లో టికెట్ బుక్ చేసుకోకండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK