YouTube Celebrates Minecraft’s One Trillion Milestone with a Special Logo : యూట్యూబ్ లోగో మారింది చూశారా.. దానికి కారణం మైన్‌క్రాఫ్ట్ (Minecraft) వీడియో గేమ్ సక్సెస్. మైన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్... మంచి పాపులర్ వీడియో గేమ్‌ల్లో ఒకటి. ఇప్పుడు ఈ గేమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి యూట్యూబ్‌లో వన్ ట్రిలియన్ వ్యూస్ లభించాయి. దీంతో యూట్యూబ్ తన లోగోను మార్చింది.
అత్యధికంగా అమ్ముడైన వీడియో గేమ్స్‌లలో మిన్‌క్రాఫ్ట్ వీడియో ఒకటి. ఈ గేమ్ విడుదలైనప్పటి నుంచే దీనికి ఒక రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. ఎంతో క్రియేటివితో రూపొందించిన ఈ గేమ్.. క్రేజ్‌ను పెంచింది మాత్రం యూట్యూబే. ఇది లైసెన్స్ లేని బాండికామ్ సాఫ్ట్‌వేర్‌లో రికార్డ్ చేసిన 480p క్రాఫ్టింగ్ ట్యుటోరియల్‌లతో ప్రారంభమైంది. తర్వాత, ఇది కమ్యూనిటీ ఈవెంట్‌లు, లైవ్‌స్ట్రీమ్‌లు, స్పీడ్‌రన్‌లు, ప్రైజ్ మనీలతో టోర్నమెంట్‌లకు కూడా ‘లెట్స్ ప్లేస్’గా మారింది.
Also Read : RRR Pre Release Event: ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు భారీ ప్లాన్- వేడుక ఎప్పుడంటే?
ఈ బ్లాక్-బిల్డింగ్ గేమ్ యూట్యూబ్‌లో ఒన్ ట్రిలియన్ వ్యూస్‌ని అధిగమించింది. ఈ గేమ్‌ను స్వీడిష్ ప్రోగ్రామర్, (Swedish programmer) మార్కస్ పెర్సన్, (Markus Persson) మే 10 - మే 16 2009లో కేవలం ఆరు రోజుల్లో మొదటి వెర్షన్‌ను రూపొందించారు. ఈ శాండ్‌బాక్స్ ప్రాజెక్ట్‌ను (sandbox project) మొదట 'కేవ్ గేమ్' (Cave Game) అని పిలిచేవారు. దీని ఫుల్ వెర్షన్ కోసం రెండేళ్ల పాటు అప్‌డేట్ చేశారు. అలా 2011లో ఫుల్ వెర్షన్ విడుదలైంది. ఆ సమయంలో ఈ గేమ్‌కు చాలా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే మిన్‌క్రాఫ్ట్ ( Minecraft) అనే పేరును ఫైనల్ అయ్యింది. మిన్‌క్రాఫ్ట్ వీడియో గేమ్.. అత్యంత తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొంది రికార్డులు సృష్టించింది.
Also Read : సౌరవ్ గంగూలీ మంచి బ్యాటర్, కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకుమించి అబద్ధాలకోరు కూడా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook