Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444 టికెట్ కొట్టిన కండక్టర్..

Bus Ticket For Parrots: పంజరంలో రామచిలుకలను పెట్టుకుని మహిళ ప్రయాణిస్తుంది. ఇంతలో టికెట్ కోసం కండక్టర్ వచ్చాడు. మహిళ దగ్గర రామచిలుకలను చూసి టికెట్ లు తీసుకొవాల్సిందిగా సూచించాడు.దీంతో ఈ  ఘటన కార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 28, 2024, 11:15 AM IST
  • జైలు నుంచి పాలన సబబు కాదన్న లెఫ్ట్ నెంట్ గవర్నర్..
  • తీవ్రంగా మండిపడిన ఆప్ మంత్రి..
Bus Ticket For Parrots: ఇదేం విడ్డూరం.. చిలుకలకు రూ. 444  టికెట్ కొట్టిన కండక్టర్..

Karnataka Conductor Charges Rupees 444 For Parrots: మనలో చాలా మంది మూగజీవాలను ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. కుక్కలు, పిల్లులు, కోతులు, రామచిలుకలను కూడా  పెంచుకుంటారు. కొన్నిసార్లు వీటిని తమతో తీసుకుని బస్సులలో ప్రయాణిస్తుంటారు. కొందరు కండక్టర్ లు చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. మరికొందరు మాత్రం మూగ జీవాలకు కూడా టికెట్ తీసుకొవాలని చెప్తుంటారు. మూగజీవాలను బస్సులలో తీసుకెళ్లేటప్పుడు కొన్నిసార్లు గొడవలు జరిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ప్రస్తుతం బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంను అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఒక మహిళ..తన మనవారితో కలిసి కేఎస్ఆర్టీసీ బస్సులో.. బెంగళూరు నుంచి మైసూర్ కు వెళ్తున్నారు. అప్పుడు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మహిళకు బస్సు ప్రయాణం ఉచితం కాగా.. ఆమె చేతిలో పంజరంలో ఉన్న రామచిలుకలకు టికెట్ లు తీసుకొవాలని, కండక్టర్ సూచించారు.

నాలుగు రామచిలుకలకు కలిపి, రూ. 444 టికెట్ ను కొట్టాడు. మహిళ  ఆ డబ్బులను ఇచ్చి టికెట్ తీసుకుంది. ఈ టికెట్ చూసి మహిళతో పాటు, తోటి ప్రయాణికులు కూడా అవాక్కైయ్యారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కేఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు.

Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..

ప్రయాణికులు తమతో జంతువులను బస్సులలో తీసుకెళ్తే, టికెట్ తీసుకొవాల్సి ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారమే కండక్టర్ టికెట్ ఇచ్చాడని దీనిపై రాద్ధంతం అవసరంలేని కేఎస్ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనను చూసిన నెటిజన్లు మాత్రం ఇదేం వింతరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News