Madhya pradesh: మానవత్వం పూర్తిగా నశించింది. సాటి మనిషి పట్ల దయ, ప్రేమ, సానుభూతి మచ్చుకైనా కన్పించడం లేదు. మరణించిన బిడ్డను భుజంపై మోసుకుని బయల్దేరిన ఘటన అది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా మహమ్మారి సమయంలో పేదరికంతో అలమటిస్తూ మరణించిన ఆప్తుల్ని భుజాలపై మోసుకెళ్లిన దయనీయ పరిస్థితులు చూశాం. ఇప్పుడు కరోనా లేనప్పుడు కూడా అటువంటి దృశ్యమే కదలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఛతార్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటన ఇది.
తీవ్ర అస్వస్థతకు గురైన నాలుగేళ్ల కుమారుడిని బుక్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లగా..పరిస్థితి విషమించడంతో దామోహ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించాడు. బిడ్డ మృతదేహం ఊరికి చేర్చేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేస్తే ప్రయోజనం కన్పించలేదు. బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి..నిద్రపోతున్నట్టుగా నమ్మించి బస్సులో బుక్స్‌వాహా ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడేదైనా వాహనం సమకూర్చాల్సిందిగా అధికారుల్ని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. తన పేదరికం గురించి వివరించినా కనికరించలేదు.
చేసేది లేక బిడ్డ మృతదేహాన్ని భుజంపై వేసుకుని కాలినడకనే ఇంటికి బయల్దేరాడు ఆ తండ్రి. ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తండ్రి బాధను గమనించిన కొందరు స్థానికులు సహాయం చేశారు. నాలుగేళ్ల అతడి కుమారుడి మృతదేహాన్ని గ్రామానికి చేర్చడంలో సహాయపడ్డారు. అదికారులకు మాత్రం సాటి మనిషనే సానుభూతి లేదు. పేదరికంలో ఉన్నాడనే కనికరం లేదు. బిడ్డ మరణించాడనే దయ కూడా లోపించింది.
A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp
— Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022
Also read: Peacock video viral: అందమైన అతిధి..అనుకోకుండా వచ్చింది..మరో ఇంటికి తరలింది, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook