Chicken Curry With Rupee Coins: భోజనం చేయడానికి వెళ్లిన వినియోగదారులకు హోటల్ వాళ్లే తిరిగి డబ్బులు ఇస్తున్నారు. అదీ కూడా ఆహారంలో వేసి ఇస్తుండడం గమనార్హం. అదేంటి అని ఆశ్చర్యపోవద్దు. నిజం హోటల్‌లో తినడానికి వెళ్లిన యువకులకు ఆహారంలో రూపాయి బిల్లలు కనిపించాయి. హోటల్ సిబ్బంది నిర్వాకం వలన చికెన్ కర్రీలో నాణేలు కనిపించడం తీవ్ర దుమారం రేపుతోంది. హోటల్ సిబ్బందిపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
Also Read: Gun Shot: మా అమ్మ, అక్కనే వేధిస్తారా? పోకిరీల తుపాకీ గుళ్లకు ఎదురునిలబడ్డ బాలుడు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి పిస్తా హౌజ్‌కు శనివారం(24 ఫిబ్రవరి) మధ్యాహ్నం భోజనం చేయడానికి కొందరు యువకులు వెళ్లారు. హోటల్‌కు వెళ్లిన అనంతరం చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ రావడంతో హోటల్ సిబ్బంది చికెన్ కర్రీ వారికి సర్వ్ చేశారు. అయితే తింటున్న సమయంలో ఆ యువకులకు రూపాయి నాణేలు కనిపించాయి. ఒకటి కాదు మూడు రూపాయి బిల్లలు కనిపించడంతో అవాక్కయ్యారు. వాటిని ఫొటోలు, వీడియోలు తీసుకుని హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇలా జరగడంపై హోటల్ నిర్వాహకులను నిలదీశారు. తినడానికి వస్తే ఇలాంటి ఆహారమా ఇచ్చేది? అని ప్రశ్నించారు. కొద్దిసేపు హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Also Read: Belgrade Airport: 'పెద్ద రంధ్రం'తోనే గాల్లో ఎగిరిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు
దీనికి సంబంధించిన విషయాలన్నీ యువకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో హోటల్ నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆహారంలో బొద్దింకలు, బల్లులు, ఈగలు, దోమలు వంటివి కనిపిస్తుంటే కొత్తగా రూపాయి బిల్లలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 'హోటల్ వాళ్లే తిరిగి డబ్బులు ఇస్తుంటే మీకేంటి బ్రో' అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. హోటళ్లపై అధికారులు తనిఖీ చేయకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని మరికొందరు చెబుతున్నారు. హోటళ్లలో పరిశుభ్రత, నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలని సూచిస్తున్నారు.
దేశ, విదేశీ అన్ని రకాల వంటకాలతో హైదరాబాద్ ఆహారానికి పెట్టింది పేరు. అలాంటి హైదరాబాద్‌లో ఇటీవల తరచూ హోటల్‌లో అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో పంజాగుట్టలో ఎక్స్‌ట్రా రైతా అడిగినందుకు దాడి చేసి ఓ యువకుడిని చంపిన విషయం తెలిసిందే. జనవరి 1వ తేదీన ఆబిడ్స్‌లోని ఓ హోటల్ సిబ్బంది వినియోగదారులపై కర్రలతో దాడి చేసింది ఇంకా మరువలేదు. ఇక ఈ మధ్య కాలంలో హోటల్ ఆహారంలో బల్లులు, ఈగలు, బొద్దింకలు కనిపిస్తున్నాయి. హోటల్ సిబ్బందికి వినియోగదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. హోటళ్ల నిర్వహణపై తనిఖీలు చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ఇప్పటికైనా హోటళ్లపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ప్రజలు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి