Tractor Theft Video Gujarat: చెడపకురా.. చెడేవు అని ఎప్పుడో పెద్దలు చెప్పారు. తప్పుడు పనులు చేస్తే.. కర్మ కూడా వెంటనే అనుభవిస్తారని కూడా అంటూ ఉంటారు. ఓ వ్యక్తి ట్రాక్టర్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన ఘటనలో విచిత్రం చోటు చేసుకుంది. షోరూమ్ ఆవరణలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను దొంగిలించే క్రమంలో కింద నిలబడి ఉండగా.. ట్రాక్టర్ స్టార్ట్ అయి అతని మీదకే ఎక్కింది. దీంతో ట్రాక్టర్ టైర్ కింద చిక్కిపోగా.. అతని మీద వెళ్లిపోయింది. అయినా ఆ దొంగకు ఏమీ కాలేదు. వెంటనే లేచి నడుచుకుంటూ ముందుకు వెళ్లి.. ట్రాక్టర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ ఘటన గుజరాత్‌లోని ఆరావల్లిలోని మోదాసా నగరంలోని హజీరా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఓ వ్యక్తి రాత్రి సమయంలో ట్రాక్టర్ దొంగతనం కోసం వచ్చాడు. ట్రాక్టర్‌కు ఉండే పెద్ద టైర్ ముందు నిలబడి ఏదో పని చేస్తుండగా.. అది ఒక్కసారిగా స్టార్ట్ అయింది. మనోడు తప్పించుకునే ప్రయత్నించినా.. అప్పటికే కదలడంతో దొంగ కాలు టైరుకింద ఇరుక్కుంది. అది మెల్లగా అతని మీద నుంచి ఎక్కి.. ముందుకు వెళ్లిపోయింది. దీంతో దొంగ పని ఔట్ అనిపిస్తుంది.
కానీ మనోడు దొంగతనం చేయాలనే సంకల్పమే వెంటనే పైకి లేపింది. అంత బరువైన ట్రాక్టర్ మీద నుంచి వెళ్లినా.. ఏ మాత్రం చెక్కు చెదరకుండా ముందుకు పరిగెత్తాడు. కదులుతున్న ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ట్రాక్టర్ వెనుక టైరు కిందకు పడినా.. దొంగకు ఎలాంటి ప్రమాదం జరగపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ट्रेक्टर चोरी की अजीब घटना
एक शख्स ट्रैक्टर चोरी करने गया
चाबी घुमाई और अचानक से ट्रेक्टर स्टार्ट हो गया
चोर ट्रैक्टर के टायर नीचे पूरी तरह दब गया
लेकिन लडका बाल बाल बच गया और ट्रेक्टर लेकर फरार
अरवल्ली के मोडासा के एक ट्रैक्टर शोरूम की घटना#tractor #THIEF pic.twitter.com/DCCS4xgZkU— Archana Pushpendra (@margam_a) September 9, 2023
దొంగ లేచి వెంటనే అదే ట్రాక్టర్‌పై కూర్చోని వెళ్లడం సీసీటీవీ వీడియోలో రికార్డు అయింది. దీంతో ఆ దొంగ అక్కడి నుంచి ట్రాక్టర్‌తో అక్కడి నుంచి పరారయ్యాడు. జన్మాష్టమి రోజు ఈ ఘటన జరిగింది. ఆ రోజు సెలవు ఉండడంతో ఏకంగా షోరూమ్‌కే వచ్చి ట్రాక్టర్‌ను చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
Also Read: Tanu Jain: ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలి.. టీచర్‌గా మారి.. తనూ జైన్ లైఫ్ స్టోరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి