Venomous snake head stuck in empty beer tin in jagtial: చాలామంది పాములంటే భయంతో పారిపోతుంటారు. పాము అక్కడుంటే.. ఇక్కడి నుంచి ఇటే మాయమైపోతుంటారు. వర్షాకాలంలో పాముల బెడగ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా చెట్లు, పొలాలు, అడవులు ఉన్న చోట పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. పాములను చూడగానే కొంత మంది స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం ఎక్కడ కాటు వేస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. పామును చంపడానికి సైతం వెనుకాడరు. పాములకు చెందిన వెరైటీ వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి.
నెటిజన్లు సైతం పాముల గురించి ఉన్న వార్తల్ని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. కొన్నిసార్లు పాములు కూడా అనుకొని ఆపదల్లో ఇరుక్కుంటాయి. ఇవి ఎలుకల కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు గద్దలు, ముంగీసల బారిన కూడా పడుతుంటాయి. ఇదిలా ఉండగా.. ఒక పాముకు దాహాం వేసిందో మరేంటో.. కానీ ఒక ఖాళీ బీర్ బాటిల్ లో తలదూర్చింది. కానీ బైటకు రాలేక తెగ ఇబ్బందులు పడింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తివివరాలు..
జగిత్యాలలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని రైతువేదకి ఉంది. ఇది పొలాలకు దగ్గరగా ఉంటుంది. అక్కడ కొంత మంది బీర్ బాటిళ్లను, బీర్ టిన్ లను తాగేసి పడేస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక పాముకు దాహంవేసిందో.. మరేందో కానీ.. ఆ ఖాళీ బీర్ సీసాలో తలపెట్టింది. ఇంతవరకు బాగానే.. ఉన్న.. మరల తల బైటకు తీద్దామంటే మాత్రం అవ్వలేదు. ఎంతలా అటు ఇటు వెళ్లిన కూడా ఆ బాటిల్ నుంచి పాము తల మాత్రం బైటకు రాలేదు. పాపం..ఆ పాము కాసేపు అటు ఇటు తిరుగుతూ విలవిల్లాడి పోయింది.
Read more: KTR: సారీ లేడీస్.. కావాలని అలా అనలేదు.. విచారం వ్యక్తం చేసిన కేటీఆర్..
పొలాల దగ్గర ఉన్న కొంత మంది రైతులు, ఆ మార్గం గుండా వచ్చిపోతున్న వారు.. పామును చూశారు. కానీ దాని దగ్గరకు వెళ్లి బాటిల్ ను తలనుంచి వేరు చేసే సాహాసం మాత్రంచేయలేదు. కానీ చివరకుపాము.. పొదల్లోకి వెళ్తుండగా.. ఆ చెట్లకు తాకి.. ఆ బాటిల్ అదే తలనుంచి వేరుపడింది. పాపం.. పాము బతుకు జీవుడా..అంటూ పొదల్లోకి వెళ్లిపొయింది. అక్కడున్న వారు..ఈ ఘటనను తమఫోన్ లలో ఫోటో తీసుకున్నారు. ఈ పిక్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి