Car helicopter Video Viral: మన దేశంలో టాలెంట్ కి కొదవలేదు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి అద్భుతాలు సృష్టించిన వారు చాలా మందే ఉన్నారు. తాజాగా యూపీకి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ప్రతిభనే చూపించాడు. అతడు కారును హెలికాప్టర్‌లా మార్చేసి.. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేశాడు. ఇతడు పెళ్లి బుకింగ్ కోసం తన కారును హెలికాప్టర్‌గా మార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ కారు వీడియోను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది చట్ట విరుద్దమని పేర్కొంటూ.. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వీడియో ఓపెన్ చేస్తే.. ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ కు చెందిన ఈశ్వర్దిన్ తన వ్యాగన్ఆర్ కారుకు హెలికాప్టర్ రూపాన్ని ఇచ్చాడు. ఇదంతా పెళ్లి బుకింగ్ చేశాడు. ఇది ట్రాఫిక్ పోలీసులకు నచ్చలేదు. అతడిపై ఎంవీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ఆ మోడిఫైడ్ కారును సీజ్ చేశారు. దీనిపై ఈశ్వర్దిన్ మాట్లాడుతూ.. బీహార్‌లో కూడా ఇలాంటి వాహనాలు నడుస్తున్నాయని.. అక్కడ ఇష్టానుసారం వాటిని ఉపయోగిస్తున్నారని.. అయితే ఇక్కడ నిషేధించడం దారుణమని అన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి వాహనాలు నడపడం కామన్ అని అతడు అన్నాడు.
Also Read: Viral News: పెళ్లిలో వరుడికి షాక్.. అందరి ముందు అలా చేశాడని నవవధువు ఏంచేసిందో తెలుసా..?
అయితే అతడు కారును హెలికాప్టర్ గా మార్చే ముందు తమ వద్ద నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అదనపు పోలీసు సూపరింటెండెంట్ విశాల్ పాండే తెలిపారు.అందుకే ఎంవీ చట్టం ప్రకారం, అతడిపై చర్య తీసుకోవడంతోపాటు జరిమానా కూడా విధించారు. ఇకపై అతడికి నడపడానికి అనుమతి లేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలే ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి వింత వీడియోలనే చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook