Whatsapp messages: వాట్సాప్‌లో ఆ మెసేజ్ కోసం వెతుకుతున్నారా ?

Whatsapp messages: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం కల్పించనుంది. అదే వాట్సప్ సెర్చ్ మెస్సేజ్. అదేంటని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలివీ..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2022, 08:09 PM IST
  • త్వరలో వాట్సప్‌లో సరికొత్త ఫీచర్
  • పాత మెస్సేజ్ లేదా వీడియో లేదా డాక్యుమెంట్స్ సెర్చ్ చేసుకునే అవకాశం
  • తొలుత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులో
 Whatsapp messages: వాట్సాప్‌లో ఆ మెసేజ్ కోసం వెతుకుతున్నారా ?

Whatsapp messages: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం కల్పించనుంది. అదే వాట్సప్ సెర్చ్ మెస్సేజ్. అదేంటని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలివీ..

వాట్సప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ కోసం ప్రయత్నిస్తోంది. వాట్సప్‌లో మీరు ఏదైనా మెస్సేజ్ కోసం వెతకాలంటే సులభతరమయ్యేలా కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకురానుంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఫేస్‌బుక్ అనుబంధిత వాట్సప్ కొత్త డిజైన్ ప్రవేశపెట్టింది. ఇది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ విభాగానికి సంబంధించినది. ఇప్పుడు షార్ట్‌కట్‌లో కొత్త సెర్చ్ బటన్ ప్రవేశపెట్టబోతోంది. అది కూడా ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం. ఈ కొత్త షార్ట్‌కట్ గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌తో వాట్సప్ అప్‌డేటెడ్ వెర్షన్ యాప్ 2.22.6.3 తో వస్తుంది. 

WABetainfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం..వీడియో కాల్ ఐకాన్ తరువాత ఈ కొత్త బటన్ ఉంటుంది. కొంతమంది యూజర్లకు గ్రూప్ ఇన్ఫో సెక్షన్‌లో ఈ కొత్త బటన్ కన్పిస్తుందని సమాచారం. అయితే ఇంకా ప్రస్తుతానికిది పని చేయడం లేదు. ఇంకా ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లోనే ఉండటం వల్ల కంపెనీ ఇంకా దీనిపై పని చేస్తోంది. మరోవైపు కేవలం ఆండ్రాయిడ్ యూజర్ల కోసమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. ఇటు ఐవోఎస్ యూజర్లకు కూడా అందుబాటులో తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 

ప్రస్తుతం ఈ సెర్చ్ బటన్ యాప్ హోమ్ స్క్రీన్‌పై ఉంది. ఈ ఫీచర్ ఆధారంగా మీరు పంపిన లేదా రిసీవ్ చేసుకున్న ఏ మెస్సేజ్‌నైనా సెర్చ్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్‌లో చాలా ఫిల్టర్ బటన్స్ ఉంటాయి. ఫోటోలు, వీడియోలు, లింక్స్, గిఫ్ట్స్, ఆడియో, డాక్యుమెంట్స్ ఇలా పలు ఫిల్టర్స్ ఆధారంగా సెర్చ్ ఈజీ చేసుకోవచ్చు.

ఈ వారం ప్రారంభంలో వాట్సప్..డెస్ట్ టాప్ యూజర్ల కోసం మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్ కోసం ప్రయత్నించింది. ఈ ఫీచర్ ఆథారంగా యూజర్లు ఈమోజీలతో మెస్సేజ్‌లకు స్పందించవచ్చు. ఇటువంటిదే ఫీచర్ ప్రస్తుతం ఫేస్‌బుక్ , ఇన్ స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉంది. 

Also read: Whatsapp Deleted Messages: వాట్సప్ డిలీట్ మెస్సేజెస్, వీడియోస్ ఎలా చూడాలో తెలుసా, చాలా సులభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News