Who is Rohit Sharma's wife: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఎవరో తెలుసా ?

Rohit Sharma Love Story: రోహిత్ శర్మ, రితికా సజ్దే వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ఆ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డిసెంబర్ 15, 2015 న ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటైంది. అప్పటి నుంచి రోహిత్ శర్మ, రితిక సజ్దె దంపతులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Written by - Pavan | Last Updated : Dec 14, 2022, 05:01 AM IST
  • రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే గురించి ఆసక్తికరమైన విషయాలు
  • రోహిత్ శర్మ, రితికలను కలిపింది ఇంకెవరో కాదు..
  • రోహిత్ శర్మ వ్యవహారాలు అన్ని చూసుకునే మేనేజర్ రితికనే..
  • రోహిత్ శర్మ, రితికల లవ్ స్టోరీ ఎలా మొదలైంది, పెళ్లయి ఎన్నేళ్లయింది ?.. ఫుల్ డీటేల్స్
Who is Rohit Sharma's wife: రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే ఎవరో తెలుసా ?

Rohit Sharma Love Story: రోహిత్ శర్మ, రితికలను కలిపింది ఎవరో కాదు..
రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతుల పరిచయానికి మరో ఫేమస్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కారణం. రితిక సజ్దెకు యువరాజ్ సింగ్ వరుసకు సోదరుడు అవుతాడు. ఆ ఇద్దరి మధ్య సోదర-సోదరి బంధం కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడైన సంగతి తెలిసిందే. (Image Source: Twitter).

who-is-rohit-sharma-wife-ritika-sajdeh-rohit-sharma-love-story-to-Rohit-Sharma-wedding-in-pics.jpg

రోహిత్ శర్మ మేనేజర్ రితికనే..
టీమిండియా కెప్టేన్‌గా, ఫేమస్ క్రికెటర్‌గా నిత్యం ఎన్నో ఎండార్స్‌మెంట్స్‌తో బిజీగా ఉండే రోహిత్ శర్మ డైలీ యాక్టివిటీస్‌ని రితిక సజ్దె మేనేజ్ చేస్తుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోహిత్ శర్మ బిజినెస్ డీల్స్‌తో పాటు ఇతర వ్యవహారాలు అన్నీ రితిక సజ్దె పర్యవేక్షిస్తుంటారు. (Image Source: Twitter). 

who-is-rohit-sharma-wife-ritika-sajdeh-rohit-sharma-love-story-to-Rohit-Sharma-wedding-anniversary-photos.jpg

విదేశీ టూర్స్ ఎంజాయ్ చేసే దంపతుల జాబితాలో..
ఎప్పుడూ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉండే రోహిత్ శర్మకు ఏ మాత్రం వీలు చిక్కినా భార్య రితిక సజ్దెను తీసుకుని విదేశీ టూర్లు ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడు. ఖాళీ సమయంలో భార్య రితికతో సరదాగా గడపడానికే రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తుంటాడనే విషయం ఆయన్ను అభిమానించే వాళ్లందరికీ తెలిసిన విషయమే. (Image Source: Twitter).

who-is-rohit-sharma-wife-ritika-sajdeh-rohit-sharma-love-story-to-Rohit-Sharma-wedding-photos.jpg

జాక్‌పాట్ కొట్టానన్న రోహిత్ శర్మ
వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా భార్య రితికతో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రోహిత్ శర్మ.. తాను జాక్‌పాట్ కొట్టేశాను అంటూ అందులో రాసుకొచ్చాడు. (Image Source: Twitter).

who-is-rohit-sharma-wife-ritika-sajdeh-rohit-sharma-love-story-to-Rohit-Sharma-wedding-anniversary-pics.jpg

పెళ్లయి ఎన్నేళ్లయింది ?..
పెళ్లయి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రోహిత్ శర్మ, రితిక సజ్దె జంట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు హ్యాపీ వెడ్డింగ్ యానివర్శరీ అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. (Image Source: Twitter).

who-is-rohit-sharma-wife-ritika-sajdeh-rohit-sharma-love-story-to-Rohit-Sharma-wedding-photos-gallery.jpg

ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే.. 
రితికకు ముందుగా ప్రపోజ్ చేసింది రోహిత్ శర్మనే. మిడ్-డే.కామ్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం రోహిత్ శర్మ ఎక్కడైతే తను 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే బ్యాట్ పట్టుకున్నాడో.. అదే ముంబైలోని బొరివిలి స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో 2015 ఏప్రిల్లో రితికకు లవ్ ప్రపోజ్ చేశాడు. (Image Source: Twitter).

Trending News