Mercury Impact: బుధ మహాదశ ప్రారంభమైతే 17 ఏళ్ల పాటు తిరుగుండదిక, అంతా కనకవర్షమే

Mercury Impact: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా మహత్యముంది. జ్యోతిష్యం ప్రకారమే అంతా నడుచుకుంటారు. గ్రహాల స్థితిగతులు, నక్షత్రాల పరివర్తనం ఇలా వివిధ అంశాల ఆధారంగా జ్యోతిష్యం అంచనా వేస్తుంటారు. అంటే జ్యోతిష్య శాస్త్రానికి నేరుగా సంబంధం గ్రహాలతో ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2023, 10:14 AM IST
Mercury Impact: బుధ మహాదశ ప్రారంభమైతే 17 ఏళ్ల పాటు తిరుగుండదిక, అంతా కనకవర్షమే

Mercury Impact: అందుకే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఇది వివిధ రాశుల జాతకంపై ప్రభావం చూపిస్తుంది. అదే క్రమంలో ఏర్పడనున్న బుధ మహాదశ గురించి తెలుసుకుందాం..

హిందూమతంలో ప్రతి గ్రహానికి ఓ ప్రాధాన్యత ఉంది. ఇందులో భాగంగానే బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పరిగణిస్తారు. అంతేకాకుండా బుధుడిని డబ్బు, వ్యాపారం, తెలివితేటలు, కెరీర్‌కు కారకుడిగా భావించడం వల్ల బుధుడి కదలికల ప్రభావం ఈ అంశాలపై తప్పకుండా ఉంటుందంటారు. బుధుడి గోచారంతో ఏర్పడే మహాదశ లేదా అంతర్దశ ప్రబావం ఆ వ్యక్తి జీవితంపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉండనుంది. బుధుడు ప్రతి 25 రోజులకు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతుంటాడు. కుండలిలో బుధుడు శుభమైన స్థానంలో ఉంటే అన్నీ శుభంగానే జరుగుతాయి. అంతేకాదు..ఈ జాతకుల లాజికల్ థింకింగ్ అద్భుతంగా ఉండి కెరీర్ బాగుంటుంది. వ్యాపారులైతే అమితమైన లాభాలు ఆర్జిస్తారు.  కుండలిలో బుధ మహాదశ ప్రారంభమైతే..ఇక ఈ జాతకం వారిని ఎవరూ ఆపలేరు. ఊహించని ధనం వచ్చి పడుతుంటుంది. 

బుధ మహాదశ అనేది వెంటనే అయిపోయేది కాదు. ఏకంగా 17 ఏళ్లుంటుంది. దీనివల్ల అమితమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎవరైన వ్యక్తి జాతకంలో కుండలిలో బుధ మహాదశ ప్రారంభమైతే అది 17 ఏళ్లు ఉంటుందని అర్ధం. అంటే ఈ సమయంలో ఆ వ్యక్తికి బుద్ధి, వ్యవహార శైలి, వ్యాపారం, ఆర్ధిక పరిస్థితి అన్నీ బాగుంటాయి. ఎలాంటి ఇబ్బంది రాదు. 17 ఏళ్ల పాటు ఊహించని ధన లాభం ఉంటుంది. అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. కుండలిలో బుధుడు శుభమైన స్థానంలో ఉండేవారికే ఈ బుధ మహాదశ వర్తిస్తుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలైతే అమాంతంగా పెరుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే బుధ మహాదశ నడుస్తుంటే అనేక విధాలుగా కష్టపడాల్సి వస్తుంది. నష్టాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు బుధ సంబంధత ఉపాయాలు ఆచరించాలి. ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించి..ఆకుపచ్చ కూరగాయలు ఎక్కవగా తీసుకోవాలి. మంత్రాలతో బుధ గ్రహాన్ని ఆరాధించాలి. ప్రతి బుధవారం నాడు ఆవుకు ఆహారం పెట్టాలి. దాంతోపాటు నిర్ణీత పద్ధతిలో బుధవారం నాడు బుధగ్రహ సంబంధిత వస్తువుల్ని దానం చేయాలి. మంచి జ్యోతిష్యునికి చూపించి కుండలి ఆధారంగా సలహాలు, సూచనలు తీసుకోవాలి. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుండలిలో బుధుడు బలహీనంగా ఉంటే ఈ దుష్పరిణామాలు ఎదురౌతాయి. నెగెటివ్ ప్రభావం పడుతుంటుంది. ఆ వ్యక్తి త్వరగా మార్గ భ్రష్టుడౌతుంటాడు సరైన నిర్ణయం తీసుకోలేడు.  వ్యాపారంలో నష్టాలు ఎదురౌతాయి. 

Also read: Mars Transit 2023: అక్టోబర్ 3 నుంచి ఈ మూడు రాశులపై కనకవర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News