Baby Naming Ceremony: హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతీ వ్యక్తి జీవితకాలంలో 16 మతకర్మలను పాటించాల్సి ఉంటుంది. అందులో 'నామకరణం' ఐదో స్థానంలో ఉంది. పుట్టిన ప్రతీ బిడ్డకు నామకరణ మహోత్సవం జరుపుతారు. కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లు లేదా తమ తాతల తండ్రుల పేర్లు లేదా తమ పేరుతో కలిసొచ్చేలా పిల్లలకు పేర్లు పెడుతారు. అయితే పిల్లల నామకరణం ఎలా జరపాలనే దానిపై శాస్త్రాల్లో కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తప్పనిసరిగా హవనం చేయాలి
హిందూ శాస్త్రాల ప్రకారం పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు గ్రహాలు, రాశులు, తిథి చూడాలి. జన్మ జాతకం ప్రకారం రాశిని నిర్ణయించాక పేరు పెట్టాలి. నామకరణం రోజున హవనం తప్పనిసరిగా చేయాలి. బ్రాహ్మణ పండితులకు భోజనం పెట్టి గౌరవించాలి.
చెవిలో మొదట కులదైవం పేరు ఉచ్ఛరించాలి
నామకరణం రోజు బిడ్డ చెవిలో మొదట తాత,నానమ్మలు, తల్లిదండ్రులు పేరును ఉచ్ఛరించాలి. కొంతమంది తమ కుల దైవం పేరును మొదట ఉచ్ఛరించి ఆ తర్వాత బిడ్డకు పుట్టబోయే పేరును ఉచ్ఛరిస్తారు. నామకరణం సందర్భంగా ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి.
పాత్రపై ఓం, స్వస్తిక్ చిహ్నం
నామకరణం రోజున బిడ్డకు సూర్యుడి కిరణాలు తాకాలి. హవనం ఇంట్లో వీలు పడకపోతే ఆలయంలో కూడా చేయవచ్చు. నామకరణం సందర్భంగా ఉపయోగించే పాత్రపై ఓం, స్వస్తిక్ గుర్తు ఉండాలి. పిల్లవాడి నడుం చుట్టూ పురిబెట్టు లేదా పట్టు దారం కట్టాలి.
ఆ రోజుల్లో, తిథుల్లో పేరు పెట్టవద్దు
అష్టమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ రోజున పిల్లలకు పేర్లు పెట్టకూడదు. అలాగే, చతుర్థి తిథి, నవమి తిథి, చతుర్దశి తిథి, రిక్త తిథిలలో పిల్లలకు పేర్లు పెట్టడం కూడా అశుభమనే చెప్పాలి.
ఈ తేదీల్లో పేరు పెట్టడం శుభ సూచకం
హిందూ శాస్త్రాల ప్రకారం.. బిడ్డకు పేరు పెట్టేందుకు 1,2,3,5,6,7,10,11,12,13 తేదీలు శుభప్రదం. అలాగే, గ్రహాలు,రాశులు, తిథిని బట్టి పేర్లు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే దురదృష్టం వెంటాడవచ్చు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దీనిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook