Mercury Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం ఫిబ్రవరి 7వ తేదీన శని రాశి మకరరాశిలోకి ప్రవేశించబోతోంది. జనవరి 14, 2023న గ్రహాల రాజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించాడు. అయితే ఫిబ్రవరి 7న మెర్క్యూరీ అదే రాశిలోకి ప్రవేశించాడు. మకరంలో బుధుడు మరియ సూర్యదేవుడి కలయిక వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈయోగం నాలుగు రాశులవారికి చాలా మేలు చేస్తుంది. వీరి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బుధాదిత్య యోగం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి (Aries)
బుధ సంచారం వల్ల మేషరాశివారు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. బుధాదిత్య యోగం వల్ల ఈ రాశులవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా వీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.
తులారాశి (Libra)
మకరరాశిలో బుధుడు సంచరించడం వల్ల తులారాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. ఆస్తి లాభం ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కన్య (Virgo)
బుధ సంచారం వలన ఏర్పడిన బుధాదిత్య యోగం కన్యారాశి వారికి మంచి రోజులను తీసుకొస్తోంది. దీంతో బంపర్ ప్రయోజనాలను పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. కెరీర్ మునుపటి కంటే అద్బుతంగా ఉంటుంది. మీ లవ్ సక్సెస్ అవతుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది.
మకరరాశి (Capricorn)
బుధాదిత్య యోగం వల్ల ఈ రాశివారు శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగులు లభిస్తాయి. మీరు వివిధ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
Also Read: Shani Amavasya 2023: ఈ రోజే మౌని అమావాస్య..నది స్నానాలు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి