June Horoscope 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చనున్నాయి. గ్రహాల రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల జూన్ నెలలో 5 రాశులవారు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
సింహరాశి
గ్రహాల రాశి మార్పు కారణంగా సింహరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీరు జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మీకు భారీగా డబ్బు చేతికి అందుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి
జూన్ నెలలో వృశ్చికరాశి వారు ప్రయోజనం పొందుతారు. మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
జూన్ నెలలో ధనుస్సు రాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీరు మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. మీరు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు.
Also Read: Shash Rajyog: జాతకంలో ఈ రాజయోగం ఉన్నవారు కింగ్ లా బతుకుతారు..!
వృషభం
జూన్‌లో పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ నెలలో మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీకు సాహిత్యంపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
మిధునరాశి
ఈ నెలలో మిథునరాశి వారి ఆదాయం పెరుగుతుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. అధికారుల సహకారం లభిస్తుంది. మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also Read: Mercury transit 2023: మరో నాలుగు రోజుల్లో ఈ 3 రాశులకు అదృష్టం పట్టనుంది.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook