Venus Transit Lucky Zodiacs 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాలతో పోలిస్తే శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని కీర్తి, సంపాద, ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. అలాగే లక్ష్మీ దేవి గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అందుకే ఈ శుక్ర గ్రహం రాశుల్లో మార్పులు చేర్పులు చేయడం, తిరోగమనం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ గ్రహం ఏప్రిల్ 24వ తేది రాత్రి 11 గంటలకు మేష రాశిలోకి ప్రవేశించింది. అయితే ఇలా సంచార దశలో ఉన్న ఈ గ్రహం ఏప్రిల్ 28న ఉదయం 7 గంటలకు కదలికలు జరపబోతోంది. దీంతో 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందితే, మరికొన్ని రాశులవారు తీవ్రంగా నష్టపోతారు. అయితే శుక్రుడి ప్రత్యేక కదలికల కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథునరాశి:
శుక్రగ్రమం జరిపే ప్రత్యేక కదలిక కారణంగా మిథున రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఆదాయ వనరులు పెరిగి ఆర్థిక లాభాలు రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వృత్తిపరమైన జీవితం గడుపతున్నవారు అనేక శుభవార్తలు వింటారు. అలాగే వీరు డబ్బు ఆదా చేయడం వల్ల ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా విపరీతమైన ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. అలాగే మిథున రాశివారికి ఈ సమయంలో శృంగార జీవితంలో ఆనందం పెరుగుతుంది.
కన్యా రాశి:
శుక్రుడు సంచారం కదలికలు కన్యా రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. దీంతో పాటు అనుకు పనుల్లో కూడా సులభంగా ఫలితాలు సాధిస్తారు. దీంతో పాటు డబ్బు ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. దీతో పాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. అంతేకాకుండా కుటుంబ సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. ఒంటరిగా జీవిస్తున్నవారికి ధన లాభాలు కూడా కలుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
మకర రాశివారికి కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు కూడా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఇంతక ముందు పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా డబ్బు పొందుతారు. దీంతో పాటు వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. అలాగే వీరికి ధన ప్రవాహం కూడా రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సుఖం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా కూడా వీరు బలపడతారు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి