Moon Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ మే 26న ఆ రాశివారికి పండగే పండగ. చంద్రుడి మేషరాశిలో ప్రవేశమే ఇందుకు కారణం. ఆ వివరాలు తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు ఏ రాశిలోనైనా కేవలం రెండున్నర రోజులే ఉంటాడు. ఆ తరువాత రాశి మారిపోతాడు. ఇవాళ మే 26వ తేదీన చంద్రుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశి గురువుగా ఉన్న చంద్రుడి కదలిక అన్నింటికంటే వేగంగా ఉంటుంది. ఇవాళ అపర ఏకాదశి రోజున చంద్రుడు మంగళ గ్రహ రాశి మేషంలో ప్రవేశించనున్నాడు. ఇవాళ అర్ధరాత్రి 12 గంటల 39 నిమిషాల్నించి మే 29వ తేదీ ఉదయం 11 గంటల 16 నిమిషాలవరకూ మేషరాశిలో ఉంటాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులవారికి అంతులేని లాభాలు కలుగుతాయట.
కర్కాటక రాశివారికి చంద్రుడి ఈ కదలిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రెండున్నర రోజుల వ్యవధిలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఎక్కడైనా చిక్కుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది.
తులరాశివారికి ఈ సమయంలో లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారులకు చాలా మంచి సమయం. ఈ సమయంలో పాత మిత్రులు కలుస్తారు. కొత్త కార్యక్రమాలు లాభదాయకంగా ఉంటాయి.
వృశ్చికరాశివారికి చంద్రుడి మేషరాశి ప్రవేశం చాలా లాభదాయకమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ సందర్బంగా సంపద వచ్చి పడుతుంది. కొత్త ఉద్యోగాల అణ్వేషణ పూర్తవుతుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.
ధనస్సురాశివారికి ఈ సమయం చాలా శుభసమయం. పనిచేసే చోట అతిపెద్ద ప్రయోజనం చేకూరనుంది. ప్రయాణాలు చేసే సమయంలో డబ్బులు సంపాదిస్తారు. అటు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
Also read: Rajat Patidar: వేలంలో పట్టించుకోనందుకు..సెంచరీతో సమాధానం చెప్పిన రజత్ పటిదార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి