Navratri Day 1 2023: నేటి నుంచి శారదీయ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఇదే రోజు భక్తులు అమ్మవారి విగ్రహాలతో పాటు కలశాన్ని ప్రతిష్టిస్తారు. దీంతో పాటు రోజు నుంచి దుర్గా సప్తశతి పారాయణం చేస్తారు. అమ్మవారి మండపాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించేవారు 9 రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. హిమాలయ పర్వతాలకు కుమార్తెగా శైలపుత్రి దేవి వ్యవహరిస్తుంది. ఈ రోజు భక్తులు శైలపుత్రి అమ్మవారి రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా సూర్యగ్రహం సంచారం కారణంగా దుష్ప్రభావాలు ఎదర్కొంటున్నవారికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శైలపుత్రి అమ్మవారికి పూజించేవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవారు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గంగాజలంతో తల స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉండే పూజా గదిలో అన్నింటిని శుభ్రం చేసి..పూజను ప్రారంభించాల్సి ఉంటుంది. శైలపుత్రి అమ్మవారి ముందు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూజను ప్రారంభించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
కలశ స్థాపనకు అక్టోబర్ 15వ తేదీ ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు అనుకూల సమయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కలశ స్థాపన తేదీ: ఆదివారం 15 అక్టోబర్ 2023
ఘటస్థాపన ముహూర్తం: ఉదయం 06:30 నుంచి 08:47 వరకు..
అభిజీత్ ముహూర్తం: ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు..
పూజావిధానం:
పూజా కార్యక్రమంలో పాల్గోనేవారు తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.
ముందుగా గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి.
అక్షత, ఎర్రచందనం, ఎర్రని పువ్వులతో అమ్మవారిని అలంకరించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అమ్మవారికి పండ్లు, పుష్పాలు, తిలకం సమర్పించాలి.
ఇలా చేసిన తర్వాత కలశాన్ని తయారు చేసుకుని దుర్గదేవి ముందు పెట్టాల్సి ఉంటుంది.
శైలపుత్రి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించాలి.
దుర్గా చాలీసా పారాయణం చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..