September Rashi Parivartan 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ నెల ఎంతో శుభప్రదమైనది భావిస్తారు. ఈ నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా బుధుడితో పాటు సూర్యుడు, శుక్రుడు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా ఈ సెప్టెంబర్ నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మార్పులతో పాటు అదృష్టం కూడా సహకరించబోతోంది. ఈ నెలలో అన్ని గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు సంచారం అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ఎఫెక్ట్ చూపించబోతోంది. అయితే ఈ నెలలో ఏయే గ్రహాలు సంచారం చేయబోతున్నాయో ఇప్పుడు తెలుసుకోండి.
సూర్యుడు సంచారం:
సూర్యుడి సంచారం సెప్టెబర్ 16న జరగబోతోంది. అయితే ఈ గ్రహం సొంత రాశి సింహ రాశిలోకి ప్రవేశించడం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువగా మేష రాశివారిపై పడుతుంది.
బుధుడి సంచారం:
ఈ సెప్టెబర్ నెలలో బుధుడి సంచారం కూడా జరగబోతోంది. ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాకుమారిడిగా భావిస్తారు. ప్రతి నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేస్తుంది. సెప్టెంబర్ 4న బుధుడు సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. అంతేకాకుండా ఈ గ్రహం మరో సారి కూడా ఇదే నెలలో రాశి ప్రవేశం చేస్తుంది. ముఖ్యంగా ఈ గ్రహం సెప్టెంబర్ 23న బుధుడు కన్యారాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా 12 రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఆ తర్వాత ఈ బుధ గ్రహం అక్టోబర్ 10 మరో రాశిలోకి ప్రవేశించబోతోంది.
శుక్రుడి సంచారం:
సెప్టెంబర్ నెలలో శుక్రుడు కూడా రాశి సంచారం చేయబోతున్నాడు. సూర్య, బుధ గ్రహాలతో ఈ గ్రహం కూడా సంచారం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 18న శుక్రుడు తులారాశిలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా మొత్తం రాశులవారిపై శుభ, అశుభ ప్రభావం పడుతుంది. ఆ తర్వాత ఈ గ్రహం అక్టోబర్ 13న మరో సారి సంచారం చేస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.