Budhaditya Rajayogam 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించినట్టే బుధ, సూర్య గ్రహాలు రాశి ప్రవేశం చేయనున్నాయి. శుక్రుడి రాశి వృషభంలో బుధుడి ప్రవేశం బుధాదిత్య రాజయోగ నిర్మాణానికి దారితీస్తోంది. ఈ రాజయోగం ప్రభావం 3 రాశులకు అత్యద్భుతంగా మారనుంది.
హిందూ పంచాంగం లెక్కల ప్రకారం మే 15వ తేదీన సూర్యుడి వృషభ రాశిలో గోచారం చేయనున్నాడు. ఆ తరవాత జూన్ 7వ తేదీన బుధుడు అదే రాశిలో ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు ఉన్న రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. బుదాదిత్య రాజయోగాన్ని హిందూ మతం ప్రకారం అత్యంత శుభదాయకంగా భావిస్తారు. ఈ యోగం ఏ వ్యక్తి కుండలిలో ఉంటుందో ఆ వ్యక్తికి సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. ఓ రాజుకు లభించే సుఖ సంతోషాలు, ధన వైభవం కలగవచ్చు. బుధాదిత్య రాజయోగం ఏ 3 రాశులకు వరంలా మారనుందో తెలుసుకుందాం..
సింహ రాశి
బుధాదిత్య రాజయోం ప్రభావం సింహ రాశి జాతకులకు ఊహించని లాభాల్ని ఇస్తుంది ఉద్యోగ-వ్యాపారాల్లో అభివృద్ధి కన్పిస్తుంది. అటు ఆదాయంతో పాటు లాభాలు కూడా పెరుగుతాయి, పనిచేసే చోట అందరి సహకారంతో మంచి వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కెరీర్ అద్భుతంగా మల్చుకునే అవకాశం కలుగుతుంది. రాజకీయాల్లో ఉండేవారికి చాలా లాభాలుంటాయి. కొత్త ఉద్యోగావకాశాలు కన్పిస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు సూర్య, బుధ గ్రహాల కలయికతో ఏర్పడే బుధాదిత్య రాజయోగం అంతులేని అష్ట ఐశ్వర్యాలను అందిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మీకే కాకుండా మీ కుటుంబానికి సైతం గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు కనకవర్షం కురిపించడం ప్రారంభిస్తాయి. కొత్త కొత్త మార్గాల్నించి డబ్బులు వస్తాయి.
వృషభ రాశి
బుధాదిత్య రాజయోగం వృషభ రాశి జాతకులకు అంతులేని లాభాల్ని ఆర్జించి పెడుతుంది. పెళ్లికానివారికి పెళ్లి సంబంధాలు ఖాయమౌతాయి. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి. ఈ రాశివారికి ఊహించని ధనలాభం కలుగుతుందియ ఆదాయానికి కొత్త మర్గాలు తెర్చుకుంటాయి. పెద్దపెధ్దోళ్లతో పరిచయాలు వ్యాపారాభివృద్ధికి దారితీస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన ఆర్ధిక సమస్యలుండవు. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.
Also read: Venus Transit 2023: చంద్రుడి రాశిలో శుక్రుడి ప్రవేశం మహర్దశ కల్గిస్తుందా, ఈ 4 రాశులకు వద్దంటే డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook