హిందూమతం ప్రకారం సూర్యుడిని లోకం ఆత్మగా పిలుస్తారు. సూర్యుడి కారణంగానే భూమిపై జీవముంది. అందుకే సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. జనవరి 14వ తదీ సాయంత్రం సూర్యుడి మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఆ వివరాలు మీ కోసం..
మకరరాశిలో శుక్రుడు, శని కలయికతో దుర్లభమైన సంయోగం ఏర్పడనుంది. 30 ఏళ్ల తరువాత మకర సంక్రంతి నాడు సూర్యుడు, శని కలయిక జరుగుతుంది. అందుకే సూర్యుడు, శని సంయోగం జ్యోతిష్యం ప్రకారం చాలా మహత్యం కలిగింది. సూర్యుడు, శని తండ్రీ కొడుకులైనా ఇద్దరికీ మధ్య వైరం చాలా ఎక్కువ. సూర్యుడి గోచారం ధనస్సు సహా 4 రాశులపై తీవ్ర నష్టం కల్గించనుంది. ఆ నాలుగు రాశులేంటి, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..
సింహరాశి
సింహరాశి జాతకులకు చెడు వార్తలు వినే అవకాశముంది. ఈ కాలంలో ఎవరి వద్దా ఉప్పు తీసుకోవద్దు. లేకపోతే ఆర్ధిక నష్టాలు రావచ్చు. కుటుంబంలో తండ్రి లేదా తండ్రి సమాన వ్యక్తితో వివాదం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
తులా రాశి
మకరరాశిలో సూర్యుడి ప్రవేశం వల్ల తులా రాశి జాతకులకు మానసికంగా అశాంతి కలుగుతుంది. ఎవరైనా స్నేహితుడు లేదా బంధువు తరపు నుంచి బ్యాడ్‌న్యూస్ వింటారు. కుటుంబ జీవితంలో ఎగుడుదిగుడు ఉంటుంది. ఒకవేళ యాత్రకు ప్లాన్ చేస్తుంటే అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీ సామగ్రి దొంగతనం కావచ్చు.
ధనస్సు రాశి
ఈ కాలంలో కుటుంబపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సంబంధాల్లో వివాదం లేదా చీలికలు రానివ్వకండి. మీ వ్యూహాలుల రహస్యంగా ఉంచుకోండి. మాట అదుపులో ఉంచుకోవాలి. కఠినంగా మాట్లాడవద్దు. కంటి సంబంధిత సమస్యలు రావచ్చు.
కుంభరాశి
ఈ సందర్భంగా ఆర్ధికంగా నష్టాలు ఎదురౌతాయి. మిమ్మల్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నవారికి విజయం లభించవచ్చు. ఈ గోచారం జీవితంలో హల్‌చల్ సృష్టిస్తుంది. పని ఒత్తిడి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. తెలివిగా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి. ఎవర్నించీ అప్పు తీసుకోవద్దు.
Also read: Dry Tulsi leaves: తులసి మొక్క ఎండిన ఆకులతో కూడా అద్భుత ప్రయోజనాలు, ఎలా వాడాలో తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook