Asia Cup 2022: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ, 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం

Asia Cup 2022: యూఏఈలో ప్రారంభమైన ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై ఘన విజయం నమోదు చేసింది. 8 వికెట్ల తేడా విజయం సాధించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2022, 10:47 PM IST
  • ఆసియా కప్ 2022 లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ, శ్రీలంకపై ఘన విజయం
  • శ్రీలంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్
  • 105 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక జట్టు
Asia Cup 2022: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ, 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం

Asia Cup 2022: యూఏఈలో ప్రారంభమైన ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు శుభారంభం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో శ్రీలంకపై ఘన విజయం నమోదు చేసింది. 8 వికెట్ల తేడా విజయం సాధించింది.

ఆసియా కప్ 2022 ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య యూఏఈలో జరిగింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్..శ్రీలంకపై అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ చేసింది. 

టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. శ్రీలంకకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఫారూఖీ వేసిన ఐదవ బంతికే కుసల్ మేండిస్ ఎల్‌బీ‌డబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తరువాత బంతికి చరిత్ అసలంక డకౌట్ అయ్యాడు. శ్రీలంక వికెట్ల పతనం అంతటితో ఆగలేదు.రెండవ ఓవర్‌లో మూడవ వికెట్ కోల్పోయింది శ్రీలంక. ఆ తరువాత నాలుగు ఓవర్లు స్థిరంగా ఆడగలిగింది. అంతలో 8వ ఓవర్‌లో ముజీబుర్ రెహ్మాన్ ఎటాక్ చేశాడు. శ్రీలంక బ్యాటర్ గుణ తిలక అవుటయ్యాడు. ఆ తరువాత పదవ ఓవర్‌లో ఐదవ వికెట్ కోల్పోయింది శ్రీ లంక. 11వ ఓవర్‌లో మొహమ్మద్ నబి ఎటాకింగ్‌కు శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయింది. ఇలా వికెట్లు ఒకదానివెంట ఒకటి కోల్పోతూ చివరికి 19.4 ఓవర్లకు 105 పరుగులకు ఆలవుట్ అయింది. 

ఆ తరువాత బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 10.1 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యం 106 పరుగుల్ని 2 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆసియా కప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి వికెట్‌కు 83 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్‌లు. 

Also read: Virat Kohli 100 Matches: రేపటి టీ20 మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేయనున్న విరాట్ కోహ్లి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News