Asia Cup 2022: టీమ్ ఇండియా మాజీ రధ సారధి విరాట్ కోహ్లి అంటే అందుకే అందరికీ క్రేజ్. ప్రత్యర్ధి దేశపు క్రికెటర్లు సైతం కీర్తిస్తున్నారు. దానిష్ కనేరియా తరువాత ఇప్పుడు బాబర్ ఆజమ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు..
ఆసియా కప్ 2022లో అత్యంత కీలకమైన, రెండవ మ్యాచ్ దాయాది దేశాలు ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆగస్టు 28 అంటే రేపు సాయంత్రం ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్డేడియంలో జరిగే ఈ మ్యాచ్‌పై క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైన టీమ్ ఇండియా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది.
ఇటీవలి కాలంలో ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉండి తిరిగి ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ అతనికి వందవ టీ20 మ్యాచ్ కూడా. విరాట్ కోహ్లీ ఆట గురించి, కెరీర్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ అంటే గొప్ప పేరని..ఒక బ్రాండ్ అని కీర్తించాడు. దానిష్ కనేరియా ప్రశంసలు మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు అందుకున్నాడు. నెట్ సెషన్ సందర్బంగా విరాట్ కోహ్లిని కలిసిన అనంతరం బాబర్ ఆజమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ కొద్దికాలంగా ఫామ్‌లో లేకపోయినా..అలాంటి క్రికెటర్‌ను ఎదుర్కోవడం అంటే చాలా సవాలుతో కూడుకున్న విషయమని చెప్పాడు. భారతీయ స్టార్ క్రికెటర్‌తో పోల్చడమంటే..ఆ ఆటగాడు ముందు తన ఆటలో టాప్‌కు చేరుకోవాలని బాబర్ ఆజమ్ వ్యాఖ్యానించాడు.
జీవితంలో ఏదీ సులభం కాదు. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయి. వాటిని జీవితంలో ఎలా ఎదుర్కొంటారనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీ ముందున్న సవాళ్లను ఎలా దాటుతారనేది మీపైనే ఉంటుంది. విరాట్ ఇప్పుడు కూడా ప్రపంచ ప్రసిద్ధ క్రికెటర్లలో ఒకడు. అతని వంటి క్రికెటర్లకు వ్యతిరేకంగా వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలనేది చాలా కీలకమౌతుంది.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి విరాట్ కోహ్లీని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ప్రతి క్రికెటర్‌కు కెరీర్‌లో ఎత్తుపల్లాలు కచ్చితంగా ఉంటాయని..వాటిని ఎదుర్కోవల్సి వస్తుందని చెప్పాడు. విజయాలు మాత్రమే ఉండి..పరాజయాలు లేకుండా ఉండటమనేది జరగదని తెలిపాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో జరిగిన మ్యాచ్ ఓ గతమని..ఆ ప్రభావం రేపు జరిగే మ్యాచ్‌పై పడదని కూడా బాబర్ ఆజమ్ చెప్పాడు. అదే సమయంలో షహీన్ అఫ్రిది లేకపోవడం లోటేనని బాబర్ ఆజమ్ అంగీకరించాడు.
Also read: Asia Cup 2022: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ, 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం
Also read: Danish Kaneria: విరాట్ అంటే ఒక బ్రాండ్, గొప్ప పేరు కూడా..ఆసియా కప్ కీలకమే, కోహ్లీపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook